నల్గొండ

ఓటర్ల నమోదుకు విశేష స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుంగతుర్తి, సెప్టెంబర్ 21: ఈనెల 10నుండి జిల్లాలో ప్రారంభమైన ఓటర్ల నమోదు జాబితాలోమార్పులు, చేర్పులు, తదితర అంశాలపై ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని సూర్యాపేట కలెక్టర్ కే.సురేంద్రమోహన్ వెల్లడించారు. శుక్రవారం ఆయన నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలో ఎన్నికల నిర్వహణ కార్యక్రమంలో భాగంగా స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు. అనతరం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఓటర్ల నమోదుపై పరిశీలన చేశారు. ఈసందర్భంగా ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 25 వరకు మాత్రమే ఈ అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటికే కేవలం 11 రోజుల్లోనే 25 వేల మంది నుండి వివిధ అంశాలపరంగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఇందులో దాదాపు 7 వేల దరఖాస్తులు కొత్త ఓటర్ల నమోదుపై కాగా మిగతావి పేర్లు, తదితరవి తప్పులు, సవరణలపై ఉన్నాయని వివరించారు. చివరి రోజు వరకు దరఖాస్తుల సంఖ్య పెరగనుందన్నారు. ఆయా దేశాల్లో ఉంటూ అక్కడి పౌరసత్వం లేని ఎన్‌ఆర్‌ఐలు కూడా ఫారం 6 ఏ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకుంటున్నారని తెలిపారు. 1-1-2018 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటు హక్కుకు అర్హులేనని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా మీసేవా, ఆన్‌లైన్ పోర్టల్ తదితర వాటితోపాటు మాన్యువల్‌గా ఓటరుగా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. 25నాటి వరకు వచ్చిన దరఖాస్తులను అక్టోబర్ 4నాటికి విచారణలు చేసి పరిష్కరిస్తామని, అదే నెల 8న తుది ఓటర్ల జాబితాని ప్రచురిస్తామని తెలిపారు. ముఖ్యంగా ఓటు హక్కు ఎంతో విలువైందని, ప్రతీ ఒక్కరు ఓటరు జాబితాలో తమ పేరుని చూసుకోవాలని తెలిపారు. ఒకవేళ తమ పేరు లేకుంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఈమారు గ్రామాల్లో చనిపోయిన ఓటర్లను తొలగించే నిమిత్తం సంబంధీకులకు నోటీసులు జారీ చేస్తున్నామన్నారు. వారం రోజుల్లో దీనికి స్పందన రాకుంటే నేరుగానే వాటిని తొలగిస్తున్నామని ఆయన తెలిపారు. జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలలో మొత్తంగా 1089 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశామని వివరించారు. తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో 303 కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. జిల్లాకు 1740 సెట్ల ఈవీఎంలు అవసరమని తెలిపారు. వీటి పనితీరుపై పరిశీలన, నియోజకవర్గాలకు తరలింపు,స్ట్రాంగ్ రూంలలో భద్రపర్చడం లాంటి కార్యక్రమాలన్నీ రాజకీయ పార్టీల నేతల సమక్షంలోనే కొనసాగుతాయని తెలిపారు. బెంగుళూరు నుండి ప్రత్యేక బందోబస్తు మద్య జిల్లాకు వీవీ ప్యాట్ ఈవీఎంలను తీసుకొచ్చి నియోజకవర్గాలలోని ఎంపిక చేసిన స్ట్రాంగ్ రూంలలో భద్రపరుస్తామని తెలిపారు. అంతకు ముందు ఆయన స్థానిక జడ్పీహెచ్‌ఎచ్ పాఠశాల గదులు, మార్కెట్ గిడ్డంగుల స్థలాలను పరిశీలించారు. కార్యక్రమంలో తహశీల్దార్ వెంకన్న, డీటీ పుష్ప, ఆర్‌ఐ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.