నల్గొండ

ఆలేరును అగ్రగామిగా నిలబెడుతా.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుర్కపల్లి, సెప్టెంబర్ 21: ప్రజలు ఆదరిస్తే ఆలేరును అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలబెడుతానని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. శక్రవారం మండలంలోని వెనుపల్లి, వెంకటపురం గ్రామాల్లో ఇంటింటికి మేనిఫెస్టోలో పొల్గొని మాట్లాడుతూ తెలంగాణను బంగారుమయంగా మరుస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రజలకు చేసిందేమిలేదన్నారు. నీళ్ళు నిధులు నియమాకాలు అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం ఏమిచేసిందో ప్రజలు ఆలోచించాలని కోరారు. తాము అధికారంలోకి వస్తే వందరోజుల్లో గుండాల మండాలన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్పడం ఖాయమన్నారు. నిరుద్యోగులకు నెలకు మూడువేలు, వృద్ధులకు రెండువేల పింఛనుతో పాటు ఇందిరమ్మ ఇండ్లకు మరో లక్ష రూపాయలు మంజూరు చేస్తా మన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. అదేవిధంగా రైతులకు ఓకే దఫా రెండు లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రవీంద్రనాథ్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీ సభ్యుడు రాజయ్య, నాయకులు శంకర్ నాయక్, బిత్తు నాయక్, మహిపాల్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి , సత్యనారయణ, కిషన్, వెంకటేష్ గౌడ్ , వెంకట్ యాదవ్, శ్రీనివాస్, హనుమంతు రెడ్డి పాల్గొన్నారు.

అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాధికారాన్ని సాధించుకోవాలి
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల, జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లె

మునుగోడు, సెప్టెంబర్ 21: రాష్ట్రంలో 56 శాతానికి పైగా ఉన్న బీసీలు పూలే, అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాధికారాన్ని సాధించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్‌గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలోని సత్య ఫంక్షన్‌లో నిర్వహించిన ‘బహుజనుల రాజకీయ భవిష్యత్తుపై ఐక్యవేదిక’ రౌండ్ టేబుల్ సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చట్టసభలలో బీసీలకు తగిన రిజర్వేషన్ కల్పించాలన్నారు. మునుగోడు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీతో సహా అన్ని పార్టీలు బీసీ అభ్యర్థికి టికెట్ ప్రకటించాలని, లేనిపక్షంలో 2018 ఎన్నికలలో పార్టీలను పక్కకు పెట్టి సమర్థవంతమైన బీసీని నాయకుడుని నిలబెట్టి గెలిపించి భవిష్యత్తులో ఆ పార్టీలకు మనుగడ లేకుండా చేస్తామని హెచ్చరించారు. బీసీల అభ్యర్థులకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న అందోళ్ మైసమ్మ దేవాలయం నుండి బీసీ సంఘం ఆద్వర్యంలో బైక్ ర్యాలీ చేపడుతున్నట్లు వారు తెలిపారు. అక్టోబర్ మొదటి వారంలో అన్ని రాజకీయ పార్టీలకు తిరుబాటుగా మునుగోడు నియోజకవర్గంలో బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో పీసీసీ అధికార ప్రతినిధులు పున్న కైలాస్‌నేత, నారబోయిన రవికుమార్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నెల్లికంటి సత్యం, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కర్నాటి విద్యాసాగర్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జక్కలి అయిలయ్యయాదవ్, ఓయూ జేఏసీ రాష్ట్ర నాయకులు తిరుమణి కొండల్, మర్రిగూడ ఎంపీపీ అనంత రాజుగౌడ్, వివిధ పార్టీల బిసీ నాయకులు తోట నరసింహచారి, బూడిద లింగయ్యయాదవ్, మిర్యాల వెంకన్న, గుంటోజు వెంకటచారి, పాలకూరి రాజుగౌడ్, పోగుల ప్రకాశ్, ఈదులకంటి కైలాస్, చాపల శ్రీను, తిర్పారి వెంకన్న, సాగర్ల లింగస్వామి, బొడ్డు నాగరాజుగౌడ్, బొడ్డు యాదయ్య, గురిజ రామచంద్రం, కర్నాటి లింగయ్య, మేకల మల్లయ్య, బెల్లి దనయ్య, గుర్రాల పరమేష్, సుబాష్, మాదగోని రాజేష్‌గౌడ్, నకరకంటి శ్రీను,ఎమ్మార్పిఎస్ నాయకులు కొమిరె స్వామి, పందుల మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

ఇద్దరు రైతులు మృతి
మాడ్గులపల్లి, సెప్టెంబర్ 21: కరెంట్ తీగలు తగిలి ఇద్దరు రైతులు కట్టా శ్రీనివాస్‌రెడ్డి (55), పనసా మల్లయ్య (70) మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని చెర్వుపల్లి గ్రామంలో పనసా మల్లయ్య పోలంలో గడ్డి కోస్తుండగా తెగి పడిన కరెంట్ వైర్లు తగిలి మృతిచెందారు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోగా మల్లయ్య మనవల్లు శ్రీనివాస్‌రెడ్డి ఇంటికి వచ్చి చెప్పగా అతను పొలం దగ్గరికి వెళ్లి వెతుకుతున్న సమయంలో శ్రీనివాస్‌రెడ్డికి కూడా తెగిపడిన కరెంట్ వైర్ తగిలి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మా సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే పార్టీలకే మద్దతిస్తాం..
* రెడ్ల సంక్షేమ సంఘం రాష్ట్ర జాక్ కో చైర్మన్ పైళ్ల హరినాథ్‌రెడ్డి
యాదగిరిగుట్ట రూరల్, సెప్టెంబర్ 21: రాబోయే ఎన్నికల్లో పేద రెడ్ల సంక్షేమానికి ఎన్నికల మేనిఫెస్టోలో ఏ పార్టీ అయితే అధిక ప్రాధ్యాన్యత ఇస్తుందో ఆ పార్టీ అందలం ఎక్కించేంత వరకు రెడ్ల సంక్షేమ సంఘం కృషి చేస్తుందని సంఘం జాక్ రాష్ట్ర కో చైర్మన్ పైళ్ల హరినాధ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి తెలిపారు. శుక్రవారం యాదగిరిగుట్ట రెడ్డి సత్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పేద రెడ్లలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు అందాలని, రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రెడ్డి విద్యార్థులకు ప్రత్యేక గురుకులాలను, స్టడీ సర్కిల్స్‌ను ఏర్పాటు చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంటుతోపాటు, విదేశీ విద్యకు 20 లక్షల రూపాయల పథకాన్ని వర్తింప చేయాలన్నారు. అలాగే ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయరంగానికి అనుసంధాన్ని చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సుడుగు శ్రీనివాస్ రెడ్డి, నల్ల వెంకట్‌రెడ్డి, శ్రీరాంరెడ్డి, రాంరెడ్డి, బాల్‌రెడ్డి, యాదగిరిరెడ్డి, జితేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, హన్మంత్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.
ఏకశిఖర వాసుడికి నిత్యారాధనలు
యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 21: ఏకశిఖర వాసుడు, భక్తవత్సలుడు శ్రీ యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహాస్వామి వారి ఆలయంలోశుక్రవారం నిత్యారాధనలు భక్తులు అర్జిత సేవలు నిత్యకళ్యాణం హోమం సేవలు శాస్త్రోక్తంగా జరిగాయి. వేకువ జామున సుభ్రాతంతో శ్రీ స్వామి అమ్మవార్లను మేలు కొల్పి హారతి నివేదన చేశారు. బిందె తీర్థం బాలభోగంతో అలయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రతిష్ఠమూర్తులను ఆరాధించిన పూజారులు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పంచామృర్తలతో అభిషేకం జరిపి తులసి పత్రాలతో అర్చించారు. ఆలయ కల్యాణ మండపంలో ఆర్చకుల వేదపడింతులు వేదమంత్రాల మధ్య స్వామి అమ్మవారుల నిత్య కళ్యాణ ఉత్సవాని పంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం వైభవంగా నిర్వహించారు. అనంతరం అలంకరించిన గజవాహనంపై స్వామి అమ్మవార్లను అధిష్ఠించి సేవోత్సవాని జరిపారు. సాయంత్రం ఆలయంలో స్వామి అమ్మవార్ల వెండి జోడి సేవోత్పవాని నిర్వహించారు.
ఆండాళ్లమ్మకు ఊంజల్ సేవ...
శ్రీ ఆండాళ్లమ్మ వారికి ప్రీతికరమైన రోజు శుక్రవారం సాయంత్రం స్వామి వారి ఆలయంలో అమ్మవారిని ఆరాదిస్తూ ప్రత్యేక పూజలు జరిపారు. అమ్మవారిని కొలుస్తూ కుంకూమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆండాళ్లమ్మ వారిని వివిధ రకాల పూలమాలతో పట్టువస్త్రాలతో బంగారు ఆభరణలతో సుందరంగా ఆలంకరించి ప్రత్యేకంగా ఆలంకరించిన ఉయ్యాలలో అధిష్ఠింపచేసి ఊంజల్ సేవోత్సవాన్ని నిర్వహించారు. శాస్త్రోక్తంగా జరిగిన సేవోత్సవంలో మహిళ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్ని కీర్తనలు చేశారు. అనంతరం పూజారులు హారతి నివేదన చేశారు.