నల్గొండ

మహాకూటమి శక్తి చూపిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతపల్లి, అక్టోబర్ 11: టీఆర్‌ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మహా కూటమి శక్తి ఏమిటో రుచి చూపిస్తామని సీఎల్‌పీ మాజీ అధినేత కే. జానారెడ్డి సవాల్ విసిరారు. మండల కేంద్రంలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో గురువారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు జానారెడ్డిని శాలువాతో సత్కరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీని విమర్శించిన కేసీఆర్‌కు తెలంగాణలో నివసించే అర్హత లేదన్నారు. కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తధ్యమన్నారు. ఆయన వెంట జడ్పీ చైర్మన్ బాలు నాయక్, కాంగ్రెస్ నాయకులు జగన్‌లాల్, బిల్యానాయక్, రమేష్ తదితరులు ఉన్నారు.