నల్గొండ

అభివృద్ధి నిరోధకులుగా కాంగ్రెస్ నాయకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, అక్టోబర్ 11: తెలంగాణ ప్రాజెక్టులను, పథకాలను అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మారారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ విమర్శించారు. గురువారం అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డిలతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. నాలుగేళ్లలో టీఆర్‌ఎస్ పార్టీ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని రీతిలో 43వేల కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. జిల్లా అభివృద్ధికి వేలకోట్ల రూపాయలు ప్రాజెక్టులు, యాదాద్రి పవర్ ప్లాంట్, మూడు మెడికల్ కళాశాలలు, బత్తాయి, నిమ్మ, దొండ మార్కెట్‌లు కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. పదవులు, కాంట్రాక్టుల కోసం ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకుల మోచేతి నీళ్లు తాగి తెలంగాణ ప్రజలను, జిల్లా అభివృద్ధిని పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ జిల్లా ప్రగతికి మైలురాయి వంటిదని ఈ ప్లాంట్ నిర్మాణంతో నాలుగువేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో పాటు 12వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. అటువంటి ప్రాజెక్టును కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిలిపివేస్తామని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనడాన్ని టీఆర్‌ఎస్ తీవ్రంగా నిరసిస్తుందన్నారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన కాంగ్రెస్ మహాకూటమితో మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మాయ చేస్తుందన్నారు. ఎన్ని ఎత్తులు వేసిన మాయకూటమి మహాకూటమికి ఓటమి తప్పదన్నారు.
నల్లగొండ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర పాలనలో కోమటిరెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించి కేవలం కాంట్రాక్టులు, మంత్రి పదవి పొంది తానే అభివృద్ధి చెందరని విమర్శించారు. ముందస్తు ఎన్నికల్లో కోమటిరెడ్డికి ఓటమి ఖాయమని నల్లగొండలో గులాబీ జెండా ఎగురనుందన్నారు. సమావేశంలో జిల్లా మహిళా కో-ఆర్డినేటర్ మాలే శరణ్యారెడ్డి, నాయకులు అబ్బగాని రమేశ్, బషీర్, కొండూరు సత్యనారాయణ పాల్గన్నారు.