నల్గొండ

గ్రామాల్లో సమస్యలపై దృష్టి సారించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, అక్టోబర్ 11: గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతున్న నేపధ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు చొరవ తీసుకుని పరిష్కరించాలని జిల్లా పరిషత్ సభ్యులు, ఎంపీపీలు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్. బాలునాయక్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలు సాగుతుండటం, పంచాయతీల్లో సర్పంచ్‌లు లేకపోవడంతో ఇన్‌చార్జిలుగా ఉన్న అధికారులే స్థానికంగా ప్రజా సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపి బడుగులతో గొంతు కలిపిన జడ్పీటీసీలు, ఎంపీపీలు సైతం ఇదే డిమాండ్‌ను వినిపించారు. జడ్పీ చైర్మన్ ఎన్.బాలునాయక్ స్పందిస్తూ గ్రామాల్లో తాగునీటి అవసరాలు, పారిశుద్ధ్యం సమస్యలు తలెత్తకుండా అధికారులు తక్షణమే స్పందించాలన్నారు. గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏఎన్‌ఎంల భర్తీకి ఎన్నికల కోడ్ పేరుతో చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వెంటనే సమస్య పరిష్కరించాలని జడ్పీటీసీలు, ఎంపీపీలు కోరారు. ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ వైద్యవసరాల విషయంలో ఎన్నికల కోడ్‌కు నిమిత్తం లేకుండా చర్యలు తీసుకోవచ్చని, వెంటనే ఖాళీగా ఉన్న ఆరోగ్య కేంద్రాల్లోకి, అదనంగా ఉన్న ఆరోగ్య కేంద్రాల నుండి ఏఎన్‌ంలను తీసుకుని ఖాళీలను భర్తీ చేయాలని సూచించారు. ఎన్నికల కోడ్ పేరుతో తాగునీటి సమస్యలు కూడా పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న తీరు గర్హనీయమన్నారు. రైతుబంధు, కల్యాణలక్ష్మిల పథకాల అమలు అధికారుల ద్వారా జరుగుతుందని మిగతా కార్యక్రమాలు కూడా అలాగే ప్రజలకు ఇబ్బంది లేకుండా కొనసాగించాలన్నారు. మిషన్ భగీరథలో పైప్‌లైన్లు వేస్తుండటం మినహా ఉమ్మడి జిల్లాలో ఒక్క ఇంటికి మంచినీటిని అందించలేదంటు కాంగ్రెస్ జడ్పీటీసీలు ఆరోపించారు. మర్రిగూడ ఎంపీపీ మాట్లాడుతూ ప్రోటోకాల్ లేకుండా మాజీ సర్పంచ్‌లు వేసిన శిలాఫలాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన జడ్పీ చైర్మన్ ఎన్. బాలునాయక్ మాట్లాడుతూ అధికారంలో ఏ పార్టీ వారున్నా ప్రోటోకాల్ పాటించాలన్నారు. ఎంపీపీ లేవనెత్తిన సమస్యపై చర్యలు తీసుకోవడంలో జరిగిన జాప్యంపై పంచాయతీరాజ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తమ నిబంధనల మేరకు పనిచేసి స్థానిక ప్రజాప్రతినిధులకు పార్టీలకు అతీతంగా తగిన గౌరవం ఇచ్చి ప్రోటోకాల్ వర్తింపచేయాల్సిందేనని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేలు లేరు.. ఎమ్మెల్సీలు రాలేదు
కళ తప్పిన జడ్పీ సమావేశం
జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం దిశగా చర్చావేదికగా నిలిచే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మరోసారి నామమాత్ర చర్చకే పరిమితమైంది. 31 అంశాల ఎజెండాతో ప్రారంభమైన సమావేశం గంటర్నరలోపే కేవలం నాలుగు అంశాలపై స్వల్ప చర్చలతో మమా అనిపించారు. విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్ అంశాలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలిచ్చారు. పలుశాఖల జిల్లా అధికారులు సైతం సమావేశానికి గైర్హాజరయ్యారు. ఎంపీలు బడుగు లింగయ్యయాదవ్, బూర నర్సయ్యగౌడ్‌లు చర్చల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు లేనందునా ప్రజా సమస్యలపై చర్చలో కీలకంగా వ్యవహారించాల్సిన జిల్లా పరిధిలోని ఆరుగురు ఎమ్మెల్సీల్లో అంతా సమావేశానికి గైర్హాజరయ్యారు.