నల్గొండ

ఆత్మగౌరవ పాలన కోసం మాకు పట్టం కట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, అక్టోబర్ 11: టీఆర్‌ఎస్ అప్రజాస్వామిక నియంత పాలనలో తెలంగాణ ప్రజలు అణిచివేతకు గురయ్యాయరని, గొర్లు, బర్రెల కోసం తెలంగాణ తెచ్చుకోలేదని ఆత్మగౌరవంతో కూడిన పాలన సాధనకు ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని మాజీ మంత్రి, పీసీసీ మేనిఫెస్టో కమిటీ కో-చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో వేయ బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు. పాతబస్తీ యాదవ సంఘం వరకు నిర్వహించిన ర్యాలీ పట్టణంలో ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా పాతబస్తీ, హనుమాన్‌నగర్‌ల నుండి బీజేపీ నుండి జిల్లా ఉపాధ్యక్షుడు గుండెబోయిన మల్లయ్యయాదవ్, వెంకన్నయాదవ్‌లు, నల్లగొండ, తిప్పర్తిల టీఆర్‌ఎస్ యువజన సంఘం మండల అధ్యక్షులు జిల్లెపల్లి పరమేష్, మర్రి మదన్‌లు కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈసందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో, ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానని, దళితుడిని సీఎం చేస్తానని చెప్పి తానే సీఎం అయన కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కహామీ అమలు చేయలేదని విమర్శిం చారు. డబుల్ బెడ్‌రూమ్‌లు, దళితులకు మూడెకరాల భూమి, ఎస్టీ, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, నియోజకవర్గానికి లక్ష ఎకరాల సాగునీరు, కేజీ టూ పీజీ ఉచిత నిర్బంధ విద్య వంటి హామీలన్ని అమలు చేయలేదని దుయ్యబట్టారు. అలాగే నల్లగొండ నియోజకవర్గానికి, జిల్లా ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం చేసిందేమి లేదన్నారు. ఉద్యోగాలివ్వమంటే బర్రెలు, గొర్రెలు, చేప పిల్లలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబ పాలన అంతం చేస్తేనే తెలంగాణ ప్రజలు, యువతకు, మహిళలకు మంచి రోజులు వస్తాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు భృతి, ఏడాదిలో లక్ష ఉద్యోగాలు, మెగా డిఎస్సీ, రైతులకు మద్దతు ధర పెంపు, రెండు లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లకు ఐదు లక్షల పథకాలను అమలు చేస్తామని కోమటిరెడ్డి వెల్లడించారు. నియోజకవర్గంలో వివిధ పార్టీల నుండి కాంగ్రెస్‌లోకి భారీగా సాగుతున్న చేరికలు నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని చాటుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ నాయకులు వంగాల స్వామిగౌడ్, గుమ్మల మోహన్‌రెడ్డి, పాశం సంపత్‌రెడ్డి, వంగూరు లక్ష్మయ్య, ఉట్కూరు వెంకట్‌రెడ్డి, జే.శ్రీనివాస్, మల్లిఖార్జున్, రమేష్, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

ఒక్క హామీనీ నెరవేర్చని కేసీఆర్
* సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి
త్రిపురారం, అక్టోబర్ 11: కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనైనా నెరవేర్చకుండా ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలను ప్రజలనెత్తిన పెట్టినాడని సీఎల్పీ మంత్రి కుందూరు జానారెడ్డి ప్రశ్నించారు. మండలంలో ఆయన గురువారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన రామాలయం, వినాయక దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కేసీఆర్ ఎప్పుడు ఫాం హౌస్‌లో ఉండడం తప్ప ఏనాడు ప్రజల సమస్యలను పట్టించుకోలేదన్నారు. సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే అధికారం నీవు అనుభవించావని మిగులు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని నేడు అప్పుల కుప్పలో ఉంచిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2లక్షల రుణమాఫీతో పాటు వివిధ బలహీనవర్గాల వారికి ఇండ్ల నిర్మాణానికి 5లక్షలు ఇస్తామని అన్నారు. ఎన్నికల్లో నాకే ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. జానారెడ్డి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన 300 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి, కర్నాటి లింగారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మర్లా చంద్రారెడ్డి, శంకర్‌నాయక్, కొండేటి మల్లయ్య, అనుముల నర్సిరెడ్డి, బుసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పి.బుచ్చయ్య, బైరంగా కృష్ణ, కసిరెడ్డి నరేష్, తిరుమల శ్రీనివాస్, హుసేన్, సిబి శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.