నల్గొండ

యాదగిరికి పోటెత్తిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, అక్టోబర్ 14: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం నిత్యారాధనలు, ఆర్జిత సేవలు శాస్తయ్రక్తంగా సాగాయి. వేకువ జామున సుప్రభాతంతో స్వామిఅమ్మవార్లను మేల్కోలిపి ఆరతి నివేధన చేశారు. బిందే తీర్ధం, బాలబోగంతో ఆలయ పూజాధికాలు ప్రారంభించారు. ముందుగా ప్రతిష్టామూర్తులను ఆరాధించిన పూజారులు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలతో కొలిచారు. వివిధ సుగంథ పూలమాలలతో పట్టు వస్త్రాలతో, ఆభరణాలతో సుందరంగా తీర్చిదిద్ధారు. కవఛ మూర్తులను స్వర్ణ పుష్పాలతో ఆరాధించి అర్చించారు. ఆలయ కల్యాణ మండపంలో అర్చక బృందం వేదమంత్రోఛ్చరణల మధ్య స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణానికి ముందు విశ్వక్సేనారాధన, పుణ్యహావఛనం, శ్రీ సుదర్శన నారసింహహోమం, గజవాహన సేవోత్సవాలు నిర్వహించారు.
బాల ఆలయంలో ఉదయ నుండి సాయత్రం నుండి కొనసాగిన సహస్రనామార్చన, అష్టోత్తర పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల రద్ధీ పెరిగింది. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు వెండిజోడి సేవ నిర్వహించారు.
లడ్డూ ప్రసాదాల కోసం భక్తుల తిప్పలు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సందర్శన కోసం వచ్చిన భక్తులకు ఆదివారం లడ్డూ ప్రసాదాల కొరత ఏర్పడింది. ఉదయం 5:30నుండి 8గంటల వరకు లడ్డూల కౌంటర్ వద్ధ భక్తులకు లడ్డూలు లభించకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అదికారులు వెంటనే అవసరమైన లడ్డూలను ప్రసాదశాల నుండి తెప్పించి లడ్డూ కౌంటర్‌లలో భక్తులకు అందుబాటులో పెట్టారు.