నల్గొండ

కేసీఆర్‌ది ధన బలమైతే మాది ప్రజాబలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, నవంబర్ 9: తెలంగాణలో ముందస్తు ఎన్నికల్లో గెలిచేందుకు కేసీఆర్ ధన బలాన్ని నమ్ముకున్నారని, కాంగ్రెస్ మాత్రం ప్రజల బలంతో గెలుపు దిశగా సాగుతుందని పీసీసీ మేనిఫెస్టో కమిటీ వైస్ చైర్మన్, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ మున్సిపాల్టీలోని సతీష్‌నగర్, క్రాంతినగర్, గొల్లగూడెంలలో గడపగడప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన వారంతా ప్రస్తుతం నల్లగొండలో తన వెంటే ఉన్నారన్నారు. ఉద్యమంతో సంబంధం లేనివారికి టీఆర్‌ఎస్ టికెట్లు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్‌లో తనకంటు వర్గం లేదని గెలిచే అభ్యర్థులకు టికెట్లు వస్తాయన్నారు. కేసీఆర్ ఓటమి లక్ష్యంగా అందరం కలిసి పనిచేస్తున్నామన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, పెండింగ్ ప్రాజెక్టులు ఎస్‌ఎల్‌బిసి, బ్రాహ్మణ వెల్లంల పూర్తవుతాయని, నియోజవర్గం, మున్సిపాల్టీ అభివృద్ధి జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నల్లగొండ మున్సిపాల్టీకి నిధులివ్వలేదని, స్థానిక సంస్థలను టీఆర్‌ఎస్ నిర్వీర్యం చేసిందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక ముందస్తుగా ప్రభుత్వం రద్ధు చేసుకున్న కేసీఆర్ కాంగ్రెస్ హామీలను కాపీకొడుతున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలో వస్తే ఇందిరమ్మరాజ్యం వస్తుందని, పేదలకు ఇళ్లు, రెండువేల ఫింఛన్లు, రుణమాఫీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, రైతులకు మద్దతు ధర అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ, కౌన్సిలర్లు అల్లి నర్సమ్మ, కేసాని కవిత, మందడి శ్రీనివాస్‌రెడ్డి, షమీ, అల్లి సుభాష్, మధు, గుమ్మల మోహన్‌రెడ్డి, శ్రీనివాస్, సతీష్‌లు పాల్గొన్నారు.