నల్గొండ

ప్రణాళికలతో అధికారులు ముందుకు వెళ్ళాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, నవంబర్ 9: శాసనసభ సాధారణ ఎన్నికల రిటర్నింగ్ అధికారులతోపాటు సహాయక సిబ్బంది కీలక భూమిక వహించాలని, ప్రణాళికలతో అధికారులు ముందుకు వెళ్ళాలని జిల్లా కలెక్టర్ కె. సురేంద్రమోహన్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల సహాయక సిబ్బందికి ఎన్నికల విధానాలపై ఒకరోజు శిక్షణ కార్యక్రంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్బంగా విధులు నిర్వహించే సిబ్బంది సవాళ్ళకు ఎప్పడు సిద్దంగా ఉండాలన్నారు. ఓటర్ల జాబితా తయారు ప్రక్రియ నుండి ఎన్నికలు ముగిసే వరకు అధికారులు సరైన ప్రణాళికలతో ముందుకుపోవాలని సూచించారు. ఎన్నికలలో సిబ్బంది విధులలో నిర్లక్ష్యం వహిస్తే రిటర్నింగ్ అదికారితోపాటు సిబ్బందికి కష్టాలు తప్పవని హెచ్చరించారు. వివిప్యాట్స్ నిర్హహణ పట్ల సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలని పోలింగ్ రోజున ఈవియం వివిప్యాట్స్ నిర్వహణపట్ల నైపుణ్యంతో ఉండాలన్నారు. సిబ్బందితో పాటు ఎన్నికలలో పోటీచేసే అబ్యర్దుల ఎన్నికల నియమావళి, ఎన్నికల విధివిధానాలు తెలుసుకునే బాద్యతతోపాటు పోటీ చేసే అభ్యర్దులు ఎన్నికల విధివిధానాలు తెలుసుకునే బాద్యత వారిపై ఉందన్నారు. నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలలో ఇవియం, వివిప్యాట్స్, కంట్రోల్ యూనిట్లు ఎన్ని అవసరము ఉన్నాయి, పోలింగ్ కేంద్రాలలో వౌలిక సదుపాయాల ఏర్పాట్లు కోసం ముందస్తు ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. ఎన్నికల పరిశీలకులు నియోజకవర్గంలోని ఎన్నికల పనితీరును ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తూ నివేదికలు తయారుచేసి ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు అందజేయాలన్నారు. ఎన్నికల రోజున మధ్యం, డబ్బులాంటివి ఓటర్లకు పంపిణీ చేయకుండా నిఘా ఉంచాలని, పరిమితికి మించిన వాహనాలను పోటీ అభ్యర్దులు వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎన్నికలలో విధులు నిర్వహించే ఉద్యోగులు పదిరోజుల ముందుగానే ఫారం-12పై పోస్టల్ బ్యాలెట్ కోసం రిటర్నింగ్ అధికారికి ధరాఖాస్తు చేసుకోవాలని, ఉద్యోగి ఏ నియోజకవర్గం ఓటరు అయ్యి ఉంటాడో అక్కడ మాత్రమే ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వికలాంగుల కోసం పోలింగ్ స్టేషన్లలో వీల్‌చైర్, ర్యాంపులు, పోలింగ్ కేంద్రాలకు తీసుకవచ్చేందుకు ప్రత్యేక రవాణ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ప్రత్యేక అధికారి ఉదయ్‌కుమార్, సంక్షేమశాఖ అధికారులు జ్యోతి, దయానందరాణి, ఎన్నికల సూపరింటెండ్ సైదులు, జమీరొద్దీన్, వంశీరాజ్ తదితరులు పాల్గొన్నారు.