నల్గొండ

టీఆర్‌ఎస్‌ను గద్దె దింపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, నవంబర్ 9: గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా మోసగించిన టీఆర్‌ఎస్‌ను ప్రజలు ఎన్నికల్లో చిత్తుగా ఓడించి గద్దె దింపాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సూర్యాపేట అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని 22వవార్డు నల్లకుంటచెర్వు తండాకు చెందిన గిరిజనులు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నుండి భారీ సంఖ్యలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి సంకినేని కాషాయ కండువాలు కప్పి స్వాగతించారు. అనంతరం మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం గడిచిన నాలుగున్నర ఏళ్ల పాలనలో ఎంతమంది దళితులకు మూడు ఎకరాల చొప్పున భూపంపిణీ చేశారో, ఎంతమంది పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇచ్చారో ప్రకటించాలని డిమాండ్‌చేశారు. రైతులకు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పి రైతులను ముప్పతిప్పలు పెట్టారన్నారు. రైతు ప్రభుత్వంగా గొప్పలు చెప్పుకుంటూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. భూరికార్డు ప్రక్షాళన కారణంగా నేటికి రైతులు ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారన్నారు. నల్లకుంటచెర్వును మంత్రి జగదీశ్‌రెడ్డి దత్తత తీసుకున్నట్లు ప్రకటించి ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. సూర్యాపేట నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం తనను గెలిపించాలన్నారు. ప్రజలు అవకాశమిచ్చి గెలిపిస్తే కేంద్రంలోని మోదీ ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నల్లకుంట్ల అయోధ్య, తప్పెట్ల శ్రీరాములు, తుక్కాని మన్మధరెడ్డి, సలిగంటి వీరేంద్ర, దేవరకొండ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.