నల్గొండ

రైతుబంధును రైతుకూలీ బంధుగా మారుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుంగతుర్తి, నవంబర్ 9: తమ స్వార్థాలు, అధికార దాహం కోసం సామాజిక న్యాయాన్ని మొదటి నుండి వల్లెవేస్తూ చివరికి దాన్ని విస్మరిస్తున్న పార్టీలను ఈ ఎన్నికల్లో తరిమికొట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రజలకు పిలుపునిచ్చారు. బీఎల్‌ఎఫ్ అభ్యర్థి పాల్వాయి నాగేశ్‌ను గెలిపించాలని కోరూతూ బీఎల్‌ఎఫ్ నియోజకవర్గ కన్వీనర్ బుర్ర శ్రీనివాస్ అధ్యక్షతన శుక్రవారం తుంగతుర్తిలో జరిగిన నియోజకవర్గస్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సామాజిక న్యాయం పేరుతో అధికారంలోకి వస్తున్న పార్టీల పాలనలో పేదోడిపై అరాచకాలు కొనసాగుతునే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీలు పేదలను మోసం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ముఖ్యంగా ఇంతకాలం ఏ పార్టీకి చేతగాని తరహాలో తాము మేనిఫెస్టోని తయారుచేసి ప్రజల మధ్యకు నిర్భయంగా వెళ్తున్నామని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ పథకాల స్థానంలో సరికొత్తవి పొందుపర్చామని తెలిపారు. విద్య, వైద్య, వ్యవయసాయం, ఉద్యోగాలు, విద్యుత్, తదితర రంగాలపై తాము సమూల మార్పులు చేశామని తెలిపారు. ముఖ్యంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కూటమి, బీజేపీ పార్టీల పాలనలో అగ్రవర్ణాలు, భూస్వాములకే తప్ప పేదోడికి ఏమాత్రం న్యాయం జరగదన్నారు. రైతుబంధుని రైతుకూలీ బంధుగా, విద్యని చదువుల సరస్వతిగా పేర్లు మార్పులు చేశామని వివరించారు. దేశ, రాష్ట్రాలలో ప్రభుత్వాలు, జెండాలు, మనుషులు మారుతున్నప్పటికీ పేదోడి బతుకులు మారడంలేదని అన్నారు. సరైన సమయంలో ఎన్నికలు పెడితే ఓడిపోతామనే భయంతో కేసీఆర్ 8 మాసాల ముందుగానే ముందస్తుకు దిగారని ఆరోపించారు. అయితే అభ్యర్థుల ముందస్తు ప్రకటన చివరికి కేసీఆర్‌కే తలనొప్పిగా మారిందన్నారు. పోటీ అభ్యర్థులకు ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుండి నిలదీతలు, ఛీత్కారాలే ఎదురవుతున్నాయని తద్వారా వారు ఓట్లు అడిగే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. కాగా, టీఆర్‌ఎస్‌కు ప్రజల నుండి వస్తున్న ఎదురీత తమకు అనుకూలంగా వస్తుందనే ధీమా కాంగ్రెస్ పార్టీలో ఉందన్నారు. అయితే వారి పరిస్థితి కూడా నేడో, రేపో ప్రకటించే అభ్యర్థుల ప్రకటనతో దారుణంగా ఉండబోతోందన్నారు.
బీఎల్‌ఎఫ్ రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ బీఎల్‌ఎఫ్ ఆలోచన విధానాలపైనే అన్ని పార్టీలు గురిపెట్టాయన్నారు. ఈసమావేశంలో అభ్యర్థి పాల్వాయి నాగేశ్, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు సర్వయ్య, జిల్లా కార్యదర్శి ఎం.రాములు, కార్యదర్శివర్గ సభ్యులు కే.యాదగిరిరావు, నాయకులు బొల్లు యాదగిరి, చంద్రవౌళి, కే.శంకర్‌రెడ్డి, ఎం.లక్ష్మయ్య, పల్లా సుదర్శన్, తొట్ల ప్రభాకర్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు,