నల్గొండ

యాదాద్రి జిల్లా ఏర్పాటుకై సర్కార్ అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట రూరల్, మే 22:యాదాద్రి పేరుతో జిల్లా ఏర్పాటుకై సర్కార్ కసరత్తు చేస్తుందని ఆ దిశగా అడుగులు వేస్తుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునిత మహేందర్‌రెడ్డి అన్నారు.ఆదివారం పట్టణంలో ఏర్పాచేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలేరు, భువనగిరి నియోజక వర్గాలు ఆధ్యాత్మిక, చారిత్రక ప్రదేశాలని రెండు ప్రాంతాల ప్రజలు అన్నదమ్ముల వలె కలసి మెలసి జీవనం సాగిస్తున్నారని ముఖ్యమంత్రి కేసిఆర్‌తో సూచన ప్రాయంగా తెలుపటం జరిగిందని అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి నూతనంగా ఏర్పాటు చేయబోయె జిల్లాకు యాదాద్రి జిల్లాగా నామకరణం చేసేందుకు అంగీకరించారని తెలిపారు.జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు కు 45 ఎకరాల స్థలం అవసరమని రాయగిరి ప్రాంతంలో 400 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నదని ముఖ్యమంత్రి దృష్టికి తీసికెళ్లినట్లు తెలిపారు. వైటిడి ఏ పరిధిలో యాదాద్రి జిల్లా ఏర్పాటు చేస్తే బాగుంగుందని ముఖ్యమంత్రికి సూచించి నట్లు తెలిపారు.యాదాద్రి జిల్లాగా ఏర్పాటు చేసేందకు ప్రభుత్వ కసరత్తు చేస్తుందని తెలిపారు.మూట కొండూర్‌ను మండలంగా చేసేందకు కూడా అంగీకరించారని గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో మూటకొండూర్ గ్రామాన్ని రెండు సార్లు సందర్శించానని తెలిపారని మూటకొండూర్ మండలంలో 15 గ్రామ పంచాయతిలు విలీనం కానున్నాయన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ నమిలె పాండు,టిఆర్‌ఎస్ నియోజక వర్గం యువజన విభాగం నాయకులు గడ్డమీది రవీందర్‌గౌడ్, అంజిరెడ్డి, నర్సింహ్మ, బాలరాజు పాల్గొన్నారు.