నల్గొండ

బహ్మోత్సవాల నాటికి యాదాద్రి పనులు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, నవంబర్ 12: వచ్చే బ్ర హ్మోత్సవాల నాటికి యాదాద్రి ఆలయ అ భివృద్ధి పనులు పూర్తికావాలని, ముఖ్యంగా ప్రధానాలయం పనులు పూర్తి చేసి భక్తుల కు స్వయంభూల దర్శనం కల్పించే దిశగా పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి వైటిడిఏ అ ధికారులకు సూచించారు. సోమవారం హై ద్రాబాద్‌లో భూపాల్‌రెడ్డిఅధ్యక్షతన వైటిడిఏ సమావేశం నిర్వహించి పనుల పురోగతిని సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఈవో గీతా, అర్కిటెక్ట్ అనందసాయి, స్థపతులు సుందర్ రాజన్, బాలు, వేలు తదితరులు ఉన్నారు.
కూటమికి ఓటమి ఖాయం * ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి
చింతపల్లి, నవంబర్ 12: ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తున్న విషకూటమికి ఓటమి ఖాయమని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మండలంలోని మదనాపురంలో సోమవారం జరిగిన బూత్‌స్థాయి సమితీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి తాము ఓడుపోక తప్పదన్న భయం కూటమికి ఫోబియాలాగ మారిందన్నారు. ఎన్ని కూటములు ఎదురైనాగాని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రజల హృదయాల నుంచి తొలగించలేరన్నారు. ఆసరా పెంచన్‌లతో పాటు రైతుబంధు, ఉచిత విద్యుత్‌తో రైతులు ఎంతో ఆనందంగా టీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేయడానికి నిర్ణయించుకున్నారని ఆయన అన్నారు. నియోజక వర్గాలకు సీట్లను పంపిణీ చేయడంలో విఫలమైన కూటమి ఇక రాష్ట్రాన్ని ఎలా పాలిస్తుందని ప్రజలు ప్రశ్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతీ కార్యకర్త బూత్‌ల వారిగా శ్రమించి కారు గుర్తుకే ఓటు వేయించి నరేంద్రకుమార్‌ను గెల్పించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా మాల్ మధనాపురం గ్రామానికి చెందిన 80మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణారెడ్డి, వెంకట్‌రెడ్డి, ఎన్ గిరి, సాగర్‌రావ్, జెడ్పిటీసి నర్సింహ అక్రం శ్రీనివాస్, రఘు, అశోక్, తదితరులు పాల్గొన్నారు.