నల్గొండ

అభివృద్ధిని చూసే ఆదరరిస్తున్నారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, నవంబర్ 12: 60 ఏళ్ల సమైఖ్య పాలనలో జరగని అభివృద్ధిని తెలంగాణ ఏర్పాటు తర్వాత కేవలం నాలుగున్నరేళ్లలోనే చేసి చూపించడం వల్లే నేడు ప్రజలంతా టీఆర్‌ఎస్‌నుఆదరిస్తూ మరోమారు ఆశీర్వదించాలని నిర్ణయించుకున్నారని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, ప్రముఖ వైద్యుడు, ఐఎం ఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ వూర రాంమూర్తి యాదవ్, ఆయన సతీమణి మాజీ కౌన్సిలర్ వూర గాయత్రి, స్థానిక 8వ వార్డు కౌన్సిలర్ నిమ్మల వెంకన్నతోపాటు పెద్దసంఖ్యలో టీడీపీ నాయకులు, మద్దతుదారులు సోమవారం స్థానిక భగత్‌సింగ్‌నగర్‌లో మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు ఓటు వేసే ముందు గతంలో వేసిన ఓటు మనకు ఏమేరకు మంచిచేసిందో ఒక్కసారి ఆలోచించాలన్నారు. ఉద్యమనేతగా తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన తనకు తెలంగాణ ఉద్యమ గడ్డగా పేరొందిన సూర్యాపేటను ఎలా అభివృద్ధి చేయాలో తెలుసునన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని తూచా తప్పకుండా అమలు చేయడంతోపాటు ఎలాంటి హామీ ఇవ్వకున్నా ఈ ప్రాంత ప్రజలు కలలో కూడా ఊహించని వైద్య కళాశాలను మంజూరు చేయించానన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సూర్యాపేటను జిల్లాకేంద్రంగా మార్చడంతోపాటు మూసీ మురికి నీటిని సేవించే దుస్థితి నుంచి విముక్తి కలిగించి ప్రజలకు స్వచ్చమైన కృష్ణాజలాలను అందించామన్నారు. గతంలో ఇక్కడ కొనసాగిన అరాచకాలకు చరమగీతం పాడించి శాంతిభద్రతలతో కూడిన సుస్థిర పాలనను అందించామన్నారు. సిండికేట్ దందాలను తుదముట్టించి దోపీడి నుంచి ప్రజలకు విముక్తి కలిగించిన తీరు అందరికీ తెలిసిందేనన్నారు. జిల్లాకేంద్ర వాసులకు అహ్లాద వాతావరణాన్ని కల్పించేందుకు సద్దల చెరువును ట్యాంకుబండ్‌గా మార్చామని, త్వరలోనే పుల్లారెడ్డి చెరువును సైతం మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. సూర్యాపేటకు మంజూరైన మెడికల్ కళాశాల పూర్తయిన తర్వాత ఈ ప్రాంత స్వరూపమే పూర్తిగా మారుతుందన్నారు. రాబోయే రోజుల్లో సూర్యాపేట నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచానికే మోడల్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పించి గుండెల్లో పెట్టి చూసుకుంటానని భరోసానిచ్చారు. డాక్టర్ రాంమూర్తియాదవ్ మాట్లాడుతూ వైద్యునిగా ప్రజలకు సేవచేసే తనకు పేద ప్రజలకు మంచిచేయాలనే తలంపు నిత్యం తన మదిలో మెదులుతూ ఉంటుందన్నారు. ప్రజలందరికీ మంచి చేయాలంటే అభివృద్ధి, సంక్షేమాలకు పాటుపడే టీఆర్‌ఎస్ పార్టీ సరైన వేదికగా భావించి పార్టీలో చేరినట్లు తెలిపారు. మంత్రి జగదీశ్‌రెడ్డి లేకుంటే మరోవందేళ్లు గడిచినా సూర్యాపేటకు మెడికల్ కళాశాల సాధ్యమయ్యేదికాదన్నారు. నిస్వార్ధంగా నిరంతరం అభివృద్ధికోసం పాటుపడుతున్న జగదీశ్‌రెడ్డి లాంటి నాయకుడు దొరకడం ఈ నియోజకవర్గ ప్రజలు అదృష్టంగా భావించాలన్నారు. ఇదే రీతిన అభివృద్ధి కొనసాగాలంటే వచ్చే ఎన్నికల్లో రెండోసారి జగదీశ్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. జగదీశ్‌రెడ్డి గెలుపు ఖాయమైందని భారీ మెజార్టీ ఇచ్చి అభివృద్ధికి మద్దతు పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్ధ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ గండూరి ప్రవళికప్రకాష్, మార్కెట్ కమిటీ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, నాయకులు మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, పోలబోయిన నర్సయ్యయాదవ్, గోదాల రంగారెడ్డి, ఉప్పల ఆనంద్, గండూరి కృపాకర్, బండారు రాజా, బీరవోలు శ్రీహర్ష, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
సూర్యాపేటలో టీఆర్‌ఎస్ భారీ ర్యాలీ
సూర్యాపేటటౌన్, నవంబర్ 12: ప్రముఖ వైద్యుడు, ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ వూర రాంమూర్తి, ఆయన సతీమణి, మాజీ కౌన్సిలర్ గాయత్రిలు టీఆర్‌ఎస్‌లో చేరిక సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వారితోపాటు టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరుతున్న నిమ్మల వెంకన్నతోపాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, డాక్టర్ మద్దతుదారులతో విద్యానగర్‌లోని గాయత్రి వైద్య శాల నుంచి పట్టణంలోని ప్రధాన వీధులగుండా భగత్‌సింగ్ నగర్‌లో నిర్వహించి సభా స్థలి వరకు ప్రదర్శన కొనసాగించారు. తెలంగాణ తల్లి, పూలే విగ్రహాలకు ఈ సందర్భంగా పూలమాలలువేసి నివాళులర్పించారు. ర్యాలీలో డాక్టర్ రాంమూర్తి డోలు వాయిస్తూ ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డు కౌన్సిలర్ నిమ్మల వెంకన్న, నాయకులు పోలబోయిన నర్సయ్యయాదవ్, మద్ది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.