నల్గొండ

అభ్యర్థి రోజుకు రూ.20 వేలే ఖర్చు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్, నవంబర్ 13: హుజూర్‌నగర్, కోదాడ శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిశీలకుడు బిజిత్‌కుమార్ ముఖర్జీ మంగళవారం సాయంత్రం హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలో పర్యటించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణ అధికారుల సమావేశంలో పలు సూచనలు, సలహాలు, గైడ్‌లైన్స్ ఇచ్చారు. ఈనెల 12 నుండి అభ్యర్థులు, వారి తరపున చేసే వ్యయాన్ని పకడ్బందీగా జమ చేయాలని ఆదేశించారు. వాహనాలు, ఫ్లెక్సీలు, ఎస్‌ఎస్‌టీ, ఎంఎంటీ, ప్లయింగ్ స్క్వాడ్‌ల పనితీరును పరిశీలించారు. ఈ టీంలు ప్రతి రోజు ఫార్మాట్‌లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి రోజు అభ్యర్థి నగదు రూ.20 వేల కంటే ఎక్కువ వ్యయం చేయొద్దరన్నారు. ఒక వేళ చేయాలనుకుంటే ఎన్నికల అధికారికి ఇచ్చిన బ్యాంకు అకౌంటు నుండి మాత్రమే చెక్ ఇవ్వాలని స్పష్టం చేశారు. అభ్యర్థులకు కూడా ఏ, బీ, సీ ప్రొఫార్మతో ఓ పుస్తకం ఇచ్చినట్లు దానిలోని కాలంలు ప్రతి రోజు పూర్తి చేసి నింపాలని సూచించారు. అంతకు ముందు ఆయన హుజూర్‌నగర్, మఠంపల్లి, జానపహడ్, నేరడిచర్ల, గరిడేపల్లి మండలాలలో పలు తనిఖీలు నిర్వహించారు. ఎస్‌ఎస్‌టీ, ఎంఎంటీ, ప్లయింగ్ టీంలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో పరిశీలించారు. ఎన్నికలలో అనుమతి పొందిన వాహనాలు తిరుగుతున్నాయా, లేక ఇతర వాహనాలు తిరుగుతున్నాయా తెలుసుకోవడానికి కొన్ని వాహనాలు ఆపి తనిఖీ చేశారు. సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, డీఆర్‌ఓ చంద్రయ్య, తహశీల్దార్ సైదులు తదితర అధికారులు పాల్గొన్నారు.