నల్గొండ

కాంగ్రెస్‌కు డిపాజిట్లు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేతపల్లి, నవంబర్ 13: డిసెంబర్‌లో నిర్వహించనున్న సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు గల్లంతవడం ఖాయమని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో టీఆర్‌ఎస్ పార్టీ 100కు పైగా సీట్లను సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మండల పరిధిలోని చెర్కుపల్లి గ్రామంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, టీఆర్‌ఎస్ అభ్యర్థి వేముల వీరేశం, ఎమ్మెల్సీ పూల రవీందర్‌లు మంగళవారం గ్రామాభివృద్ధి చైర్మన్ బంటు మహీందర్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో నేతి విద్యాసాగర్ మాట్లాడుతూ గత 65 ఏళ్లలో కాంగ్రెస్, వామపక్ష పార్టీలు నకిరేకల్ నియోజకవర్గాన్ని పాలించినప్పటికీ అభివృద్ధి చెందనంత దూరంలో నకిరేకల్ నియోజకవర్గం నిలిచిందన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలోనే పూర్తిస్థాయిలో అభివృద్ధి జరిగిందన్నారు. నేతి విద్యాసాగర్ సొంత గ్రామమైన చెర్కుపల్లిలో అంతకుముందు ఎన్నడూ లేనివిధంగా నేతి విద్యాసాగర్, అభ్యర్థి వేముల వీరేవం, ఎమ్మెల్సీ పూల రవీందర్‌లు గ్రామంలోని అన్ని వీధుల్లో ప్రచారం నిర్వహిస్తూ కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ పూజర్ల శంభయ్య, నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఎం.్భక్షంరెడ్డి, ఎంపీపీ గుత్తా మంజులారెడ్డి, సర్పంచ్ బంటు స్వరూప, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు బొజ్జ సుందర్, వెంకన్నయాదవ్, నాయకులు మాధవరెడ్డి, నేతి అనిల్, నాగరాజు, ఎల్లయ్య, రవి, వెంకన్న పాల్గొన్నారు.