నల్గొండ

యాదగిరీశుడికి ఘనంగా నిత్యారాధనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, నవంబర్ 13: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం నిత్యారాధనలు, ఆర్జిత సేవలు, కార్తీక మాస ప్రత్యేక పూజలు శాస్తయ్రుక్తంగా సాగాయి. వేకువ జామున సుప్రభాతంతో స్వామి అమ్మవార్లను మేల్కొలిపి హారతి నివేదన చేశారు. బిందె తీర్థం, బాలభోగంతో ఆలయ పూజాధికాలు ప్రారంభించారు. ముందుగా ప్రతిష్ఠామూర్తులను ఆరాధించిన పూజారులు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలతో కొలిచారు. వివిధ సుగంధ పూలమాలలతో పట్టు వస్త్రాలతో, ఆభరణాలతో సుందరంగా తీర్చిదిద్దారు. కవచ మూర్తులను స్వర్ణ పుష్పాలతో ఆరాధించి అర్చించారు. ఆలయ కల్యాణ మండపంలో అర్చక బృందం వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణానికి ముందు విశ్వక్సేనారాధన, పుణ్యహావచనం, శ్రీసుదర్శన నారసింహహోమం నిర్సహించారు. స్వామి అమ్మవార్లను గజవాహన సేవోత్సవం నిర్వహించి నిత్య కల్యాణోత్సవాన్ని పంచరాత్రగమశాస్త్రానుసారం నిర్వహించారు. బాలాలయంలో ఉదయ నుండి సాయత్రం నుండి కొనసాగిన సహస్రనామార్చన, అష్టోత్తర పూజల్లో, కార్తీక మాసం పురస్కరించుకుని సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం ఆలయంలో స్వామి అమ్మవార్లకు వెండి జోడి సేవోత్సవం నిర్వహించారు.
క్షేత్ర పాలకుడికి ఆకుపూజ
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ క్షేత్ర పాలకుడైన శ్రీ ఆంజనేయస్వామికి మంగళవారం పురస్కరించుకుని పంచామృతాభిషేకాలు జరిపారు. చందన లేపం అద్ది పూలమాలలతో అలంకరించి తమలపాకులతో పూజించి సహస్రనామార్చనలు నిర్వహించి వివిధ ఫలాలతో నివేదన చేసి హారతినిచ్చారు. అనంతరం మంత్రపుష్పం, నీరాజనం నిర్వహించారు. భక్తులు పంచనారసింహులను, క్షేత్ర పాలకుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

ముస్లింల ఇంటి పార్టీ టీఆర్‌ఎస్
* ముస్లింల సంక్షేమంలో కేసీఆర్‌కు సాటిరారెవ్వరూ!? * ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ

సూర్యాపేట, నవంబర్ 13: ముస్లిం మైనార్టీ వర్గాల అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు దేశంలో సాటి ఎవ్వరూరారని, ఇక్కడ అమలు చేస్తున్న పథకాలే అందుకు నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ముస్లిం మైనార్టీల ఆత్మీయ సభకు మహమూద్ అలీతోపాటు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకున్నారే తప్ప వారి సంక్షేమం దిశగా ఎలాంటి ఆలోచనలు కూడా చేయలేదన్నారు. ముస్లిం వర్గాల్లో అత్యధికులు పేదవర్గాలే కావడంతో ప్రభుత్వాల చేయూత లేక కనీసం విద్య కూడా అందక దుర్భర జీవితాలను గడిపారని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమ నేతగా సీఎం కేసీఆర్‌కు అన్నివర్గాల సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉందన్నారు. అందువల్లే రాష్ట్రం ఏర్పడి అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. దేశ చరిత్రలో ఎక్కడాలేని విధంగా షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి పేదరికంలో ఉన్న ముస్లిం యువతుల వివాహానికి చేయూతనిస్తున్నారన్నారు. ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసి కేబినేట్‌లో డిప్యూటీ సీఎం, ఆరుగురు చైర్మన్లు, ముగ్గురు ఎమ్మెల్సీలను ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. ఎవరూ చేయని విధంగా ముస్లింలకు కేసీ ఆర్ మేలు చేస్తున్నందున రాష్ట్రంలోని ముస్లింలంతా తమ ఇంటి పార్టీగా భావిస్తూ అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ 60 ఏళ్ల పాటు ముస్లింలను మోసగించింది కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు. తెలంగాణకు వచ్చిన సందర్భంలో గంగ, జమున, తహజీబ్‌లాగా రాష్ట్రంలో మత సామరస్యం విరజిల్లుతుందని నాడు గాంధీ చేసిన వ్యాఖ్యలు నేటి కేసీఆర్ పాలనలో నిజమవుతున్నాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ముస్లిం పక్షపాతని పేదరికంలో మగ్గుతున్న ముస్లిం మైనార్టీ వర్గాలు విద్య ద్వారానే అభివృద్ధి చేయాలనే తలంపుతో వందల సంఖ్యలో మైనార్టీ గురుకులాలను ఏర్పాటుచేసి కార్పొరేట్ స్థాయిలో విద్య అందించడం జరుగుతుందన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రూ.2వేల కోట్ల ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ఖర్చుచేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కేటాయిస్తున్న నిధుల కంటే అదనంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ అధికంగా నిధులు కేటాయించారని తెలిపారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం రూ.20లక్షల ఆర్ధికసాయం అందిస్తుందన్నారు. సూర్యాపేటలో ముస్లిం మైనార్టీల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహించి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఖాదీ బండార్ చైర్మన్ వౌలానా యూసఫ్ జావెద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ గండూరి ప్రవళిక, మార్కెట్ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా కో-ఆర్డినేటర్ రజాక్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు భాష, ముస్లిం మైనార్టీ నాయకులు వౌలానాషాహెద్, అబ్దుల్ మఖీం, రియాజుద్దిన్, జావెద్ ఆబ్‌ఖాన్, ఫక్రుద్దిన్, అక్రం, ఖాలేద్ తదితరులు పాల్గొన్నారు.

రెండో రోజు రెండు నామినేషన్లు

నల్లగొండ, నవంబర్ 13: తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల నామినేషన్ల ఘట్టం రెండో రోజు మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పనె్నండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం రెండు నియోజకవర్గాల్లో రెండు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. ఆలేరు నియోజకవర్గంలో రెండో రోజు కల్లూరి రామచంద్రారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. నల్లగొండలో గండికోట వెంకట లక్ష్మణ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కోదాడ, తుంగతుర్తి (ఎస్సీ)లో, భువనగిరి, సూర్యాపేట, నాగార్జున సాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, మునుగోడు, హుజూర్‌నగర్, నకరేకిల్ (ఎస్సీ)లలో రెండో రోజు నామినేషన్స్ దాఖలు కాలేదు.