నల్గొండ

కేసీఆర్ రంగంలోకి దిగినా గెలుపును ఆపలేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, నవంబర్ 15: ప్రజల మద్దతు, కార్యకర్తల అండదండలతో మునుగోడు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని, మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చౌటుప్పల్ మండల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం గురువారం లక్కారం శివారులో జరిగింది. సమావేశంలో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ మాయమాటలతో పాలన సాగించిన కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. కాంగ్రెస్‌తోనే సామాజిక తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. మునుగోడు నియోజకవర్గంలో కేసీఆర్, అతని కుటుంబ సభ్యులు పోటీ చేసినా విజయం తనదేనన్నారు. ప్రజలు తనపై అంత నమ్మకాన్ని పెట్టుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ద్రోహులకు కేసీఆర్ పాలనలో మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు. అధికారం అందగానే అహంకారం పెరిగిపోయిందన్నారు. ధర్నా చౌక్‌ను ఎత్తివేశాడని, ప్రతిపక్ష నేతలకు, మంత్రులకు కూడా అపాయింట్‌మెంటు ఇవ్వని స్థాయికి పెరిగిందన్నారు. ఏడు దశాబ్దాల కాలంలో సచివాలయానికి రాకుండా రాజరిక పాలన సాగించిన ఏకైక వ్యక్తి కేసీఆరేనన్నారు. మహిళలకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలేదన్నారు. ఇక కేసీఆర్ మాటలు, వాగ్దానాలు ప్రజలు నమ్మరన్నారు. డబ్బులతోనే అధికారం తెచ్చుకుంటానన్న కేసీఆర్ ఆశలు గల్లంతు కావడం ఖాయమన్నారు. ఎమ్మెల్సీగా మూడేళ్ల సమయం ఉన్నా మునుగోడు ప్రజలు తననే కోరుకుంటున్నారన్నారు. ప్రతి గ్రామానికి తాగునీరు, ప్రతి ఎకరాకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. కోమటిరెడ్డి సోదరులకు పదవులు ముఖ్యం కాదు ప్రజా సంక్షేమం ముఖ్యమన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలను గెల్చుకోని తెలంగాణలో కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిది కమీషన్‌ల చరిత్ర అన్నారు. ఈ ఎన్నికల్లో ఆయనకు డిపాజిట్ కూడా దక్కదన్నారు. కార్యకర్తలు 20 రోజుల కష్టపడి పనిచేస్తే ఐదేళ్లు సేవ చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, గుండు మల్లయ్యగౌడ్, చింతల వెంకట్‌రెడ్డి, ఉబ్బు వెంకటయ్య, దైద జగన్మోహన్‌రెడ్డి, వెన్‌రెడ్డి రాజు, చిక్కా నరసింహా, బడుగు మాణిక్యం, బడుగు మణెమ్మ, ఎం.ఎ.ఖయ్యూం, కొండ యాదగిరి, మల్కాపురం నరసింహా, పబ్బు రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సరైన వ్యక్తినే చట్టసభల్లోకి పంపించాలి
* కేంద్ర ఎన్నికల పరిశీలకులు, యూపీ ఎన్నికల ప్రధానాధికారి వెంకటేశ్వర్లు
నల్లగొండ రూరల్, నవంబర్ 15: నైతిక విలువలున్న సరైన వ్యక్తిని ఎన్నుకుని చట్ట సభలకు పంపించినట్లయితే ప్రజాస్వామ్య వ్యవస్థ పరిపుష్టమవుతుందని, ఈ దిశగా ఓటర్లు చైతన్యవంతంగా వ్యవహారించాలని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎల్.వెంకటేశ్వర్లు అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తరుపునా తెలంగాణ ఎన్నికల పరిశీలకుడిగా ఆయన రాష్ట్ర జాయింట్ సీఈవో రత్నేష్‌సింగ్‌తో కలిసి జిల్లాలో పర్యటించి కలెక్టరేట్‌లో ఎన్నికల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాజ్యంగ వ్యవస్థ ద్వారా ప్రతి వ్యక్తికి సంక్రమించిన ఓటును సక్రమంగా వినియోగించుకునేలా అధికార యంత్రాంగం ఓటర్లలో అవగాహన పెంపొందించాలన్నారు. సీ-విజల్ యాప్ ద్వారా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలును సమర్థవంతంగా అమలు జరిగేలా ప్రజల్లో దానిపై తగిన ప్రచారం నిర్వహించాలన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం వంటి అక్రమాలపై కఠిన నియంత్రణ అమలు చేయాలన్నారు. వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలన్నారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్ల తీరుతెన్నులపై జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డిలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో ఎస్పీ రంగనాథ్, డీఆర్‌వో రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.