నల్గొండ

కాంగ్రెస్ పథకాలకు జనాదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, నవంబర్ 15: కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో పెట్టిన సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన వస్తుందని ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అధికారం ఖాయమని పీసీసీ మేనిఫెస్టో కమిటీ కో-చైర్మన్, నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డు, గంథవారిగూడెం ప్రాంతాల్లో నిర్వహించిన గడపగడపకు ఎన్నికల ప్రచారంలో ఆయన ఓటర్లను కలిసి తనను గెలిపించాలంటు అభ్యర్ధించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదలందరికి ఐదులక్షల ఇళ్లు, రెండువేల పింఛన్, నిరుద్యోగ భృతి, ఉచిత గ్యాస్ సిలిండర్లు, రేషన్ సరుకులన్ని పునరుద్ధరణ వంటి సంక్షేమ పథకాలు తేనుందన్నారు. రైతులకు మద్దతు ధర పెంపు, రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తుందన్నారు. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వాల సహకారంతో చేసిన అభివృద్ధి మినహా నాలుగేళ్లలో టీఆర్‌ఎస్ ఒక్క పనిచేయలేదన్నారు. మళ్లీ తనను గెలిపిస్తే రానున్న కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో నల్లగొండ నియోజకవర్గాన్ని ఆదర్శనీయంగా అభివృద్ధి చేస్తామని, పెండింగ్ పనులన్నింటిని పూర్తి చేయిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ, వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీబీ డైరక్టర్ పాశం సంపత్‌రెడ్డి, జడ్పీటీసీ తుమ్మల రాధాలింగస్వామి, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

పదవుల కోసం సామంత రాష్ట్రంగా మారుస్తారా..?
* కూటమి నేతలకు ఎంపీ బూర ప్రశ్న

తుంగతుర్తి, నవంబర్ 15: పదవుల కోసం పక్క రాష్ట్రాల నేతల చంకన చేరి తెలంగాణను సామంత రాష్ట్రంగా మారుస్తారా..? అంటూ భువనగిరి పార్లమెంటు సభ్యుడు బూర నర్సయ్యగౌడ్ మహా కూటమి నేతలను సూటిగా ప్రశ్నించారు. గురువారం ఆయన నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్‌కుమార్‌తో కలిసి ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి నుండి పోటీ చేసే వారి భవిష్యత్ అంతా నేడు ఆంధ్ర సీఎం చంద్రబాబునాయుడు చేతిలోకి మార్చడం సిగ్గుచేటన్నారు. వాస్తవానికి పోటీ అభ్యర్థుల ఎంపికలు ఆయా పార్టీల అధిష్ఠానాల చేతుల్లో ఉంటే కాంగ్రెస్ కూటమి ఎంపిక మాత్రం చంద్రబాబు చేతిలో ఉందని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా ఎన్ని కూటమిలు వచ్చినా టీఆర్‌ఎస్ గాలి ముందు నిలబడలేవన్నారు. 66 ఏండ్లుగా వివిధ పార్టీల పాలనలో కొనసాగిన రాష్ట్రం అన్నిరంగాల్లో దివాళాతీసిందన్నారు. కేవలం 4 ఏండ్ల 4 మాసాల టీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా దేశంలోనే రోల్‌మోడల్‌గా తయారైందన్నారు. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా త్వరలోనే రెండు పంటలకు నీరందబోతోందన్నారు. తుంగతుర్తి మండలం వెలుగుపల్లి వద్ద రుద్రమ్మ చెరువు, వెంపటి వద్ద పెద్ద చెరువులతోపాటు నూనతకల్ మండలంలో మరో రిజర్వాయర్లు ఏర్పాటు కాబోతున్నాయన్నారు.
అసమ్మతి ఉన్నా.. అంతా సర్దుకుంటుంది
తుంగతుర్తి పార్టీలో కొంతవరకు అసమ్మతి ఉన్నా అంతా సర్దుకుపోతుందని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల కంటే తుంగతుర్తిలోనే పార్టీ బలం ఎక్కువగా ఉన్న విషయం చాలామందికి తెలియదని, ప్రస్తుతం నియోజకవర్గంలో ఒక నిశ్శబ్ద విప్లవం రాబోతుందని పేర్కొన్నారు. ఏరకంగా చూసినా 50వేల మెజార్టీ తగ్గదన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌వీ జిల్లా కో-ఆర్డినేటర్ కల్లెట్లపల్లి శోభన్‌బాబు, పార్టీ అధ్యక్షులు సైదులు, నాయకులు గుజ్జ యుగేందర్‌రావు, తాటికొండ సీతయ్య, తాళ్ళపల్లి సత్యనారాయణ, గుండగాని రాములుగౌడ్, పులుసు వెంకటనారాయణ, పులుసు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.