నల్గొండ

ప్రజల గుండెల్లో కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్యాల, నవంబర్ 15: ఆస్తి పంపకాల మాదిరిగా కాంగ్రెస్ నాయకులు నియోజకవర్గాలను పంచుకున్నారని నల్లగొండ ఎంపీ, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తండ్రీ కొడుకులు, అన్నదమ్ములు ఆస్తులు పంచుకున్నట్లుగా వారి వారసులు, తాపేదార్లకు టికెట్స్ ఇప్పించుకోవడంలో తలమునకలై ఉన్నారని దుయ్యబట్టారు. చిట్యాల పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్మాణం, ప్రజా సంక్షేమం, రైతుబంధు పథకం, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కేసీఆర్‌ను దింపడమే లక్ష్యంగా ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రజలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఏ ఇంటికి ప్రచారానికి వెళ్ళినా టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరనేది ప్రస్తావన లేకుండా కారు గుర్తుకు ఓటేస్తాం, కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేస్తాం అంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. దీనిని బట్టి కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచారనేది స్పష్టమవుతోందన్నారు. నూతనంగా పాస్ బుక్కులు పొందిన రైతులు పంట పెట్టుబడికి ఆందోళన చెందవల్సిన అవసరం లేదన్నారు. ఖరీఫ్, రబీ పంటలకు కలిపి డిసెంబర్ 12 తర్వాత అందజేస్తామని గుత్తా స్పష్టం చేశారు. సమావేశంలో జడ్పీటీసీ శేపూరి రవీందర్, మార్కెట్ చైర్మన్ కాటం వెంకటేశం, రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు తేరటుపల్లి హన్మంతు, టీఆర్‌ఎస్ నేతలు పాటి మాధవరెడ్డి, వనమా వెంకటేశ్వర్లు, గుండెబోయిన సైదులు, కూనూరు సంజయ్‌దాస్‌గౌడ్, వేలుపల్లి మధుకుమార్, బెల్లి సత్తయ్య, చేపూరి సత్తిరెడ్డి, కూరెళ్ళ యాదయ్య, దేశపాక రాజేశ్, కమ్మంపాటి సతీశ్, వేలుపల్లి సందీప్, పాల వెంకట్, భిక్షం, నాగరాజు, కళ్ళెం నర్సింహ,పోకల అచ్చాలు పాల్గొన్నారు.