నల్గొండ

నేటి నుండి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగిరి, మే 23: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు 24 మంగళవారం నుండి 31 వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 71 కేంద్రాలలో నిర్వహిస్తున్నారు. 25,627మంది విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షలు ఉదయం 9గంటల నుండి 12గంటల వరకు జరగనున్నాయి. ద్వితీయ సంవత్సర విద్యార్థులు 14,724మంది పరీక్షలు రాయనున్నారు. వారికి మధ్యాహ్నం 2:30నుండి 5:30గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
పరీక్షా విధులలో భాగంగా 71మంది ఛీఫ్ సూపరిటెండెంట్లను, 71మంది డిపార్డ్‌మెంటల్ అధికారులను నియమించారు. కాపీయింగ్‌ను నిరోధించడానికి పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్‌ను విధించారు. పరీక్షా సమయంలో జిరాక్స్ సెంటర్లను మూసి వేయాలని ఇప్పటికే ఆయా సెంటర్ల యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ కేంద్రం వద్ద పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేస్తారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు బందోబస్తు ఉంటుంది. ఆర్టీసి వారు విద్యార్థులను ఆయా పరీక్షా కేంద్రాలకు తరలించడానికి పరీక్షా సమయానికి అనుకూలంగా బస్సులు నడిపే ఏర్పాట్లు చేశారు.
ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ప్రాధమిక చికిత్స అందించేందుకు వైద్య సిబ్బందిని నియమిచండానికి డిఎంహెచ్‌వో ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష జరిగే సమయంలో విద్యుత్ అంతరాయం జరగకుండా చూడాలని ట్రాన్స్‌కో అధికారులకు జిల్లా అధికారులు ఆదేశాలు ఇచ్చారు.
పరీక్షలను ప్రశాంతంగా రాయాలి: ఆర్‌ఐవో
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలను ప్రశాంతంగా రాయాలని ఆర్‌ఐవో ప్రకాశ్‌బాబు విద్యార్థులకు సూచించారు. వేసవి తాపం దృష్ట్యా తప్పనిసరిగా ప్రతి విద్యార్థి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆయా పరీక్షా కేంద్రాలలో వౌలిక వసతులతోపాటు, మంచినీటి ఏర్పాట్లు చేశామని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని కేంద్రాల సిఎస్‌లకు, డివోలకు ఆదేశాలు ఇచ్చామన్నారు.