నల్గొండ

కలెక్టరేట్ ముందు ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, మే 23: శాలీగౌరారం మండలాన్ని నకిరేకల్ నియోజక వర్గంలో చేర్చాలంటూ అఖిల పక్షం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం మందు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్ష్య, కార్యదర్శులులు అనె్నబోయిన సుధాకర్, మామిడి రమేష్‌లు మాట్లాడుతూ నియోజక వర్గ పునర్విభజనలో భాగంగా శాలిగౌరారం మండలాన్ని నకిరేకల్ నియోజక వర్గం నుండి విడగొట్టి తుంగతుర్తి నియోజక వర్గంలో కలపడం మూలంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. నకిరేకల్‌కు 18కిలోమీటర్ల దూరంలో ఉన్న శాలీగౌరారం మండలాన్ని నకిరేకల్ నియోజక వర్గంలో ఉంచకుండా 60కిలోమీటర్ల దూరంలో ఉన్న తుంగతుర్తి నియోజక వర్గంలో కలపడం మూలంగా పంచాయితీ రాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఎలక్ట్రిసిటీ, రెవెన్యూసిటీ అధికారులను పలు సమస్యల పట్ల కలవడానికి వెళ్లాలంటే సూర్యాపేట నుండి తుంగతుర్తికి చేరుకోవడం ప్రజలకు చాలా భారంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. శాలీగౌరారం ప్రజలు విద్యా, వైద్యం, వాణిజ్యం, రావాణా పరంగా నకిరేకల్, నల్లగొండ పట్టణాలపై ఆదారపడుతున్నారని, ప్రజల ఆకాంక్ష మేరకు శాలీగౌరారం మండలాన్ని భౌగోలికంగా అతి దగ్గరలో ఉన్న నకిరేకల్ నియోజక వర్గంలో తిరిగి కలపాలని డిమాండ్ చేశారు. అనంతరం తమ సమస్యలు పరిష్కరించాలంటూ గ్రీవెన్స్‌డేలో వినతినందించారు. ఈ ధర్నాలో ఉపాధ్యక్షులు పాక రాములు, బోడా సునీల్, మాచర్ల కళ్యాణ్, నిమ్మల కృష్ణమూర్తి, బిజెపి మాజీ మండల అధ్యక్షులు మాదగోని నాగయ్య, భిక్షం, శ్రీను, చింత ధనుంజయ్, బోడ అరుణ, వాడపల్లి గిరి, సంపత్‌రెడ్డి, ఇతర అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.