నల్గొండ

యాదాద్రిని జిల్లాచేసి కెసిఆర్ భక్త్భివాన్ని చాటుకోవాలి: మోత్కుపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట రూరల్, మే 23: తెలంగాణ సీఎం కెసిఆర్ శ్రీ లక్ష్మినరసింహస్వామిపై తనకున్న భక్తి భావాన్ని చాటుకోవాలంటే భువనగిరిని కలుపుకుని యాదాద్రిని జిల్లాగా ఏర్పాటు చేయాలని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు డిమాండ్ చేశారు. సోమవారం రాత్రి ఆయన గుట్టకు చేరుకుని స్వామివారిని దర్శించుకుని యాదాద్రిని జిల్లాగా ప్రకటించాలన్న డిమాండ్‌తో స్వామి వారి సన్నిధిలో రాత్రి నిద్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతు లక్ష్మినరసింహస్వామి కెసిఆర్‌కు కలలో దర్శనమిచ్చి యాదాద్రిని జిల్లాగా ఏర్పాటు చేసేలా జ్ఞానబోధ చేయాలని స్వామివారిని వేడుకుంటున్నానన్నారు. యాదాద్రిని తిరుమల తిరుపతి తరహాలో ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రంగా దర్శనీయ, అధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్ధుతానని సీఎం కెసిఆర్ ఇప్పటికే ప్రకటించి ఈ దిశగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఈ నేపధ్యంలో యాదాద్రిని తిరుపతి తరహాలో జిల్లాగా ఏర్పాటు చేస్తే ప్రపంచ స్థాయిలో ఈ క్షేత్రానికి మరింత గుర్తింపు వస్తుందన్నారు. నల్లగొండ ప్రజల ఇలవెల్పయిన లక్ష్మినరసింహుడు ఇతర జిల్లాలకు వెళ్లకుండా ప్రజల సెంటిమెంట్‌ను ప్రభుత్వం కాపాడినట్లువుతుందన్నారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలను కలుపుకుని యాదాద్రిని జిల్లా కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని తాను చేపట్టిన అఖిల పక్ష ఆందోళనకు ప్రజల మద్ధతు రోజురోజుకు పెరుగుతుందన్నారు. ప్రజల ఆకాంక్షలను గమనించి ప్రభుత్వం యాదాద్రిని జిల్లాగా ఏర్పాటు చేయాలన్నారు. మోత్కుపల్లి వెంట తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు బండ్రు శోభరాణి, సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు గోద శ్రీరాములు, టిడిపి జిల్లా కార్యదర్శి పల్లెపాటి బాలయ్య ఉన్నారు.