నల్గొండ

పేటలో ప్రశాంతంగా పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, డిసెంబర్ 7: సూర్యాపేట నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో చెదురుముదురు సంఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా పూర్తయింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో పోలీస్ యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభంకావాల్సినప్పటికీ నియోజకవర్గ పరిధిలోని చాలాచోట్ల ఏడున్నర గంటలకు మొదలైంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ప్రస్తుతం చలికాలం కావడంతో ఉదయం సమయంలో వెలుతురు లేకపోవడంతో తొమ్మిది గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలలో గుర్తులు కన్పించకపోవడంతో పలుచోట్ల ఓటర్లు ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయాన్ని పోలింగ్ ఏజెంట్లు ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులకు తెలపడంతో వారు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయగా కొన్ని చోట్ల లైట్లు ఏర్పాటుచేశారు. ఉదయం నుండే ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు కేంద్రాలకు తరలిరావడం కనిపించింది. ఉదయం 9గంటల వరకు మందకొడిగా సాగిన పోలింగ్ ఆ తర్వాత ఊపందుకుంది. పోలింగ్‌లో పురుషులకంటే అధికంగా మహిళలే ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏ పోలింగ్ కేంద్రం వద్ద చూసినా మహిళలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులుతీరి నిల్చున్నారు. ఉదయం 7గంటల నుండి 9గంటల వరకు 9.28 శాతం పోలింగ్ నమోదు కాగా, 11గంటల వరకు 19.20 శాతం, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 48.68 శాతం, సాయంత్రం 3గంటల వరకు 64.51 శాతం నమోదైంది. రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి, టీఆర్‌ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి జిల్లాకేంద్రంలోని శ్రీచైతన్య పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్‌బూత్ నెం.82 సతీమణి సునీతతో కలిసి ఓటు వేశారు. మహాకూటమి తరుపున పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి జిల్లాకేంద్రంలోని బేబిమూన్ పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు, కలెక్టర్ సురేంద్రమోహన్‌లు స్థానిక కృష్ణానగర్‌లోని మిషన్ భగీరథ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ మూసీ ప్రాజెక్టు కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో కుటుంబ సమేతంగా ఓటుహక్కును వినియోగించుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సురేంద్రమోహన్, నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, స్థానిక ఆర్డీవో ఎస్.మోహన్‌రావు నియోజకవర్గ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళీని సమీక్షించారు. జిల్లాకేంద్రంలోని పలు పోలింగ్ కేంద్రాలను మధ్యప్రదేశ్ అడిషనల్ డీజీ, ఎన్నికల భద్రత ప్రత్యేక అధికారి అనిల్‌కుమార్ జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లుతో కలిసి భద్రత చర్యలను సమీక్షించారు. జిల్లాకేంద్రంలోని 14వార్డుతో పాటు పలు పోలింగ్ కేంద్రాల్లో టీఆర్‌ఎస్, బీజేపీ వర్గాల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. అదేవిధంగా చివ్వెంల మండలం తాళ్లకాంపాడు గ్రామంలో పోలింగ్ బూత్ వద్ద టీఆర్‌ఎస్ నేతలు నగదును పంచుతున్నరంటూ కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేశారు. దీంతో పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ ఎం.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.