నల్గొండ

మునుగోడును అభివృద్ధి చేస్తా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునుగోడు, డిసెంబర్ 11: శాసన సభ పలితాలలో టీఆర్‌ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిపై తనను భారీ మోజారిటితో గెలిపించిన మునుగోడు ప్రజలకు అన్ని వేళలా అండగా ఉంటూ మునుగోడును అభివృద్ధి పథంలో నడిపి ఈ ప్రాంత ప్రజల రుణ తీర్చుకుంటానని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం వెల్లడించిన శాసనసభ పలితాలలో మునుగోడు ఎమ్మెల్యేగా భారి మోజారిటితో గెలుపొందిన సందర్భంగా మండల కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గోని మాట్లాడారు. తనను ఆదరించి గెలిపించిన మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలుపారు. మునుగోడు ఎమ్మెల్యేగా గెలుపొంది తొలిసారిగా వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి పార్టీ కార్యకర్తలు, ప్రజలు అడుగడుగున నీరాజనం పలికారు. విజయోత్సవ ర్యాలీలో కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కుంభం శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి పున్న కైలాస్‌నేత, రాష్ట్ర నాయకులు వేమిరెడ్డి సురేందర్‌రెడ్డి, మహాకూటమి నాయకులు మక్కెన అప్పారావు,గుర్రం సత్యం, జాజుల అంజయ్యగౌడ్, బూడిద లింగయ్యయాదవ్, జాల వెంకన్నయాదవ్, తోట కృష్ణయ్య,మేకల ప్రమోద్‌రెడ్డి, పాల్వాయి జితేందర్‌రెడ్డి,కాటం వెంకన్న, మునుగోటి సాయికుమార్, తదితరులు పాల్గోన్నారు.