నల్గొండ

ఉమ్మడి జిల్లాలో ఎగిరిన గులాబీ జెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 11: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పనె్నండు అసెంబ్లీ స్థానాల్లో తొమ్మిది స్థానాల్లో టీఆర్‌ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగిరింది. కాంగ్రెస్ మూడింటితో సరిపెట్టుకుంది. నల్లగొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, దేవరకొండ(ఎస్టీ), ఆలేరు, భువనగిరి, సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి(ఎస్సీ) స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుపొందింది. మునుగోడు, నకిరేకల్(ఎస్సీ), హుజూర్‌నగర్ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. కోదాడ, తుంగతుర్తి స్థానాల ఫలితాలను అధికారికంగా ప్రకటించాల్సివుంది.
రాష్ట్ర వ్యాప్తంగా వీచిన టీఆర్‌ఎస్ సునామీకి నల్లగొండలో కాంగ్రెస్ సీనీయర్లు మాజీ మంత్రి కె.జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆర్. దామోదర్‌రెడ్డిలు సైతం ఓటమి పాలవ్వడం రాజకీయంగా సంఛలనం రేపింది. కాంగ్రెస్ సీనీయర్ల ఓటమిని విశే్లషిస్తే ఉమ్మడి జిల్లా ఓటర్లు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పట్ల వారు చూపిన ఆదరణకు నిదర్శనంగా కనిపిస్తుంది. తన రాజకీయ జీవితంలో పదోసారి పోటీ చేసిన జానారెడ్డి మూడోసారి ఓమి పాలవ్వగా గత ఎన్నికలో తన చేతిలో ఓడిన టీఆర్‌ఎస్ అభ్యర్ధి నోముల నరసింహయ్య చేతిలో ఆయన ఈ దఫా ఓటమి పాలయ్యారు. అలాగే గత ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై టీడీపీ రెబల్‌గా పోటీ చేసి ఓడిన కంచర్ల భూపాల్‌రెడ్డి ఈ దఫా టీఆర్‌ఎస్ నుండి పోటీ చేసి ఘన విజయం సాధించగా, ఐదోసారి నల్లగొండ నుండి వరుసగా గెలువాలన్న కోమటిరెడ్డి ఆశలు నెరవేరలేదు. ఓటర్లు ఈ దఫా మార్పుకోరిన పరిస్థితులను ఈ ఎన్నికల్లో కోమటిరెడ్డి ముందునుండి ఊహించకపోవడంతో ఓటమి పాలయ్యారు. అటు సూర్యాపేట నుండి మాజీ మంత్రి ఆర్. దామోదర్‌రెడ్డి మరోసారి టీఆర్‌ఎస్ అభ్యర్ధి, మంత్రి జి.జగదీష్‌రెడ్డి చేతిలో ఓటమి పాలవ్వడం గమనార్హం. బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసిన సంకినేని గతంలో రెండో స్థానంలో నిలువగా ఈ దఫా మూడో స్థానంలో నిలిచారు. హుజూర్‌నగర్‌లో పీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం స్వల్ప మెజార్టీతో గెలుపొంది ఓటమి తప్పించుకోగా, ఆయన సతీమణి పద్మావతి ఉత్తమ్ కోదాడలో ఓటమి చెందారు.