నల్గొండ

ఇక పంపిణీ పర్వం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మే 24: ఖరీఫ్ పంటల సాగు సీజన్‌కు సన్నద్ధమవుతున్న రైతులకు విత్తనాలు..కొత్త విద్యాసంవత్సరంలోకి అడుగిడుతున్న విద్యార్ధులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసే పర్వాన్ని ప్రభుత్వ యంత్రాంగం ఆరంభించింది. ఇప్పటికే రాష్ట్రం నుండి జిల్లాకు అక్కడి నుండి మండలాల్లోని డీలర్లకు, వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖల, సహకార సంఘాల గోదాలంకు విత్తనాలు, ఎరువులు సరఫరాకాగా రైతులకు పంపిణీ పర్వం మొదలైంది. అటు 2016-17 విద్యాసంవత్సరానికి గాను ఒకటి నుండి పదో తరగతి పాఠ్యపుస్తకాల పంపిణీ పర్వం ఆరంభమవ్వగా పుస్తకాలు జిల్లా నుండి మండలాల రీసోర్స్ కార్యాలయాల గోదాం రూమ్‌లకు చేరుకున్నాయి. కొంత మంది ప్రధానోపాధ్యాయులు ముందస్తుగా తమ పాఠశాలల పిల్లలకు కావాల్సిన పుస్తకాలను తీసుకెళ్ళి పాఠశాలల్లో భద్రపరుచుకుంటున్నారు.
95,876 క్వింటాళ్ల విత్తనాలు
జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 6,46,990 హెక్టార్లలో పంటల సాగు జరుగుతుందని అంచనా వేసిన వ్యవసాయ శాఖ ఇందుకు 68,050క్వింటాళ్ల విత్తనాల కోసం ప్రభుత్వానికి ఇండెంట్ సమర్పించారు. ఇందులో 48,100క్వింటాళ్ల విత్తనాలు తొలుత ప్రభుత్వం పంపిణీ కోసం అందించింది. ఇందులో వరి విత్తనాలు 38,550క్వింటాల్స్, కంది, వేరుశనగా, పెసర, వేరుశనగా, మొక్కజొన్న, సజ్జ, ఆముదం, సోయాబిన్, తదితర విత్తనాలు 9500క్వింటాళ్లు జిల్లాకు అందాయి. అయితే పత్తి సాగును తగ్గించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పప్పు్ధన్యాల సాగును ప్రొత్సహించేందుకు వేరుశనగా, కంది, మినుము, శనగా, మొక్కజొన్న, సజ్జ, జొన్న, ఆముదం, పొద్ధుతిరుగుడు, సోయాబిన్ రకం విత్తనాలు 47,776క్వింటాళ్లను అదనంగా ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో రైతాంగానికి గతంలో ఎన్నడు లేని రీతిలో ఈ దఫా సదరు విత్తనాలు పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే విత్తనాలన్ని మండలాలకు చేరుకున్నాయి.
పత్తి ప్యాకెట్లకు ఇండెంట్‌తోనే సరి..!
జిల్లాలో ఈ దఫా 3లక్షల 45వేల హెక్టార్లలో పత్తి సాగు చేస్తారన్న అంచనాతో 17లక్షల 50వేల ప్యాకెట్ల విత్తనాలు అవసరమని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ఇండెంట్ ఇచ్చింది. అయితే పత్తి సాగును తగ్గించాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రభుత్వం పత్తి విత్తనాల సరఫరాలో ప్రేక్షక పాత్రకే పరిమితమైంది. అయితే విత్తన డీలర్లు పత్తి విత్తనాలను విక్రయిస్తుండగా ఇప్పటికే జిల్లాలో 4లక్షల 50వేల పత్తి విత్తన ప్యాకెట్లు డీలర్ల వద్ధ విక్రయాల దశలో ఉన్నట్లుగా సమాచారం.
పంపిణీకి లక్ష టన్నుల ఎరువులు
జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో యూరియా, డిఏపి తదితర ఎరువులు 3లక్షల 89,032మెట్రిక్ టన్నులు అవసరముండగా ఇప్పటికే 1లక్ష 1165మెట్రిక్ టన్నుల ఎరువులు మండలాల్లో డీలర్లు, సహకార సంఘాల వద్ద పంపిణి దశలో ఉన్నాయి. గత ఖరీఫ్‌లో వర్షాభావంతో పంటల సాగు తగ్గిపోయి 1లక్ష 28,806టన్నుల ఎరువులు మాత్రమే పంపిణీ జరిగాయి. ఈ ఖరీఫ్‌లో 1,98,,720మెట్రిక్ టన్నుల యూరియాకు 52,443టన్నులు, 32137మెట్రిక్ టన్నుల డిఏపికి 9045టన్నులు, 1,27,249మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులకు 34,258టన్నులు, ఎన్‌వోపి 21245టన్నులకు 3949టన్నులు, ఎస్‌ఎస్‌పి 9501టన్నులకు 1110టన్నులు విక్రయ దశలో ఉన్నాయి.
పంపిణీలో పాఠ్యపుస్తకాలు..మండలాల్లో సిద్ధం
జిల్లాలో 59మండలాల పరిధిలోని 1నుండి 10వ తరగతి విద్యార్థులకు ఈ ఏడాది విద్యాసంవత్సరానికి 17లక్షల 96,860పాఠ్యపుస్తకాలు అవసరముండగా ఇప్పటిదాకా జిల్లాకు 17లక్షల 34,222పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. అంటే 97శాతం పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరినట్లుగా జిల్లా విద్యాశాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇందులో ఇప్పటికే మండల రీసోర్స్ గోదాంలకు 15లక్షల 16,026పుస్తకాలు అంటే 87శాతం పుస్తకాలు మండలాలకు చేరుకున్నాయి. ఈ నెల 31వ తేదికల్లా వాటిని మండల కేంద్రాల్లోని రీసోర్స్ గోదాంల నుండి పాఠశాలలకు సరఫరా చేయాల్సివున్న ప్రధానోపాధ్యాయుల ఆసక్తి మేరకు విద్యాసంవత్సరం ఆరంభంలోగా వాటిని పాఠశాలలకు తీసుకెళ్లనున్నారు. వివిధ తరగతుల సబ్జెక్ట్‌లకు చెందిన పుస్తకాల కొరత కారణంగా ఐదు శాతం పుస్తకాల కొరత నెలకొన్నప్పటికి జిల్లా అధికారుల ఇండెంట్‌తో వాటిని కూడా రెండో దఫాలో జిల్లాకు సరఫరా చేయడంతో పాఠ్యపుస్తకాల పంపిణీ పర్వం కొనసాగుతుంది.