నల్గొండ

ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్‌దే గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 14: సీఎం కేసీఆర్ ప్రభుత్వం పాలన, పథకాల పట్ల తెలంగాణ ప్రజల నుండి లభిస్తున్న ఆదరణతో ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్‌ఎస్‌దేనని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 16న నల్లగొండలో నిర్వహించే నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఎన్నికల సన్నాహాక సభ ఏర్పాట్లను గురువారం ఆయన రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, కంచర్ల భూపాల్‌రెడ్డిలతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడుతు వచ్చే నెలలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 16పార్లమెంట్ స్థానాల్లో గులాబీ జెండా ఎగురబోతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల పిదప కేంద్రంలో టీఆర్‌ఎస్, ఫెడరల్ ఫ్రంట్‌లు నిర్ణయాత్మక శక్తిగా అవిర్భవించనున్నాయన్నారు. సీఎం కేసీఆర్ పాలన, పథకాలను కేంద్ర పాలకులతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదర్శనీయంగా తీసుకుంటున్నాయన్నారు. సీఎం కేసీఆర్ దార్శనికత, పరిపాలన సామర్ధ్యాన్ని అవగతం చేసుకున్న దేశ ప్రజలు కేసీఆర్ మార్క్ పాలన, పథకాలు దేశమంతా అమలు జరుగాలని కోరుకుంటుకున్నారన్నారు. కేసీఆర్ పాలన మెచ్చిన ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు పోటీ పడుతున్నారన్నారు. టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సారధ్యం, ప్రసంగాలు కేడర్‌లో జోష్ నెలకొల్పుతుండగా పార్టీ మరింత బలోపేతమవుతుందన్నారు. పార్టీ కార్యకర్తలను కేటీఆర్ సైనికులుగా తయారు చేస్తున్నారని, టీఆర్‌ఎస్‌ను వందేళ్లు నిలిచి, గెలిచే పార్టీగా సీఎం కేసీఆర్ పునాదులు వేస్తుండగా, కార్యకర్తలను సైనికులుగా కేటీఆర్ తయారు చేస్తున్నారన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ 90శాతం స్థానాలను గెలుచుకోగా రానున్న పార్లమెంట్, మున్సిపల్, మండల, జిల్లా పరిషత్‌ల ఎన్నికల్లో వందశాతం విజయాలు అందుకోనుందని ఇందుకు ప్రతి కార్యకర్త తనవంతు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ కరీంపాషా, నాయకులు సుంకరి మల్లేశ్‌గౌడ్, లోడంగి గోవర్ధన్, ఎంపీపీ దైద రజిత తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా క్షీరాభిషేకం
భూదాన్‌పోచంపల్లి, మార్చి 14: మండలంలోని కనుముక్కుల గ్రామం శ్రీ పద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఆలయంలో క్షీరాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో నిత్యహోమం, బలిహరణం, తిరువీధి, గరుడవాహనం, నైవేధ్య నివేదన, పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆయన చైర్మన్ కోట మల్లారెడ్డి, పుష్పలత, గ్రామసర్పంచ్ కోట అంజిరెడ్డి, ఉపసర్పంచ్, పాక నర్సింహ్మ, నాయకులు గారెడ్డి జంగారెడ్డి, భోగ చంద్రశేఖర్, దోర్నాళ కరుణాకర్, గడ్డం జగన్నాధరెడ్డి, పాండు రంగారెడ్డి, రంగ మధు, చంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన పోలీస్ ఈవెంట్స్
:: 22,250 మంది హాజరు
నల్లగొండ రూరల్, మార్చి 14: జిల్లా కేంద్రం నల్లగొండలో గత నెల 11నుండి నిర్వహిస్తున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎస్‌ఐ, కానిస్టేబుల్స్ ఉద్యోగ అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించిన దేహాదారుఢ్య పరీక్షల ఈవెంట్స్ గురువారంతో ముగిశాయి. పటిష్టమైన బందోబస్తు, అభ్యర్థుల బయోమెట్రిక్ వివరాల నమోదు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, ధ్రువపత్రాల పరిశీలన, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించిన ఎంపిక పరీక్షలు సజావుగా ముగిశాయి. మొత్తం 24,908మంది అభ్యర్థులు హాజరుకావాల్సివుండగా 22,250మంది హాజరయ్యారు. వీరిలో 10వేల మంది పురుషులు, 1,844మంది మహిళా అభ్యర్థులు అర్హత సాధించారు. ఎంపిక పరీక్షలను ఎస్పీ రంగనాథ్, సిద్ధిపేట పోలీస్ కమిషనర్ జోయస్ డెవిల్, మెదక్ ఎస్పీ చందనాదీప్తిలు పర్యవేక్షించగా, నోడల్ అధికారిగా ఏఎస్పీ పద్మనాభారెడ్డిలు వ్యవహారించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు గంగరాం, సురేశ్‌కుమార్, రమేష్, ఆర్‌ఐలు ప్రతాప్, శంకర్, రాజ్, నరసింహచారిలతో పాటు రాచకొండ, సూర్యాపేట, మెదక్, అనే్నపర్తి పనె్నండవ బెటాలియన్ పోలీస్ అధికారులు విధుల్లో పాల్గొన్నారు.

భారీ మెజార్టీతో ఎంపీ అభ్యర్థులను గెలిపించాలి

మిర్యాలగూడ/మిర్యాలగూడ టౌన్, మార్చి 14: ఏప్రిల్ నెలలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం టీఆర్‌ఎస్ నుండి ఎవరు అభ్యర్ధి అయినా భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి కోరారు. గురువారం మిర్యాలగూడ పట్టణం నందిపాడు టీఎన్‌ఆర్ గార్డెన్‌లో జరిగిన మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గ టీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం, నూతన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2014లో పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించగలిగామని అదే విధంగా ఈసారి ఒక్క హుజూర్‌నగర్ తప్ప అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారని, భారీ మెజారిటీతో గెలిపించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. తనకు 2014లో 1,94,000 మెజార్టీ వచ్చిందని, దీనికంటే ఎక్కువ మెజార్టీ సాధించి దేశ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ చక్రం తిప్పేలా చేయాలన్నారు. సర్పంచ్‌లకు ఈసారి కేటాయించిన రిజర్వేషన్‌లే మళ్లీ జరిగే ఎన్నికల్లో కూడ ఉంటుందని, అందుకు సర్పంచ్‌లు చిత్తశుద్ధితో గ్రామాభివృద్ధికి పని చేయాలని కోరారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా కేసీఆర్ అభివృద్ధి పనులు చేస్తున్నారని, ఎన్నికల కోడ్ అమలవుతున్నందున ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని, పార్లమెంట్ ఎన్నికలు కాగానే అమలవుతాయని స్థానిక శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికలను జడ్పీటీసీ, మున్సిపాల్టీల ఎన్నికల ప్రచారంగానే చేయాలన్నారు. ఎన్నికల ప్రచారాన్ని ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా చేయాలన్నారు. భారీ మెజార్టీతో నల్లగొండ ఎంపీ స్థానాన్ని గెలుచుకునేందుకు ఈ నెల 16న నల్లగొండలో జరిగే సన్నాహక సమావేశానికి టీఆర్‌ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ వస్తున్నారని, భారీగా తరలి రావాలని కోరారు. అదే విధంగా త్వరలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగసభను కూడా విజయవంతం చేయాలని కోరారు. అనంతరం మిర్యాలగూడ నియోజకవర్గంలోని గెలుపొందిన సర్పంచ్‌లను శాలువాలు, జ్ఞ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మిర్యాలగూడ, వేములపల్లి, మాడుగులపల్లి, దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాల ఎంపీపీ, జడ్పీటీసీ, పార్టీ అధ్యక్షులు నూకల సరళ హనుమంతరెడ్డి, మంగమ్మ, రవీనాకరుణాకర్‌రెడ్డి, ఎం.నాగలక్ష్మి సైదయ్య, ఇ.పద్మ, చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, డి.నారాయణరెడ్డి, చిరమల్లయ్యయాదవ్, మోహిసిన్‌అలీ, బాలాజీనాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ మగ్దుంపాషా, మార్కెట్ కమిటి చైర్మన్ డి.చిట్టిబాబు, ఎడవెళ్లి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ఎ.నాగార్జునాచారి, జె.రంగారెడ్డి, పేలపోలు తిరుపతమ్మ, కె.వీరకోటిరెడ్డి, డి.కళావతి, షహనాజ్ బేగంలు పాల్గొన్నారు.