నల్గొండ

టికెట్లు అమ్ముకునే సంస్కృతి మీదే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, మార్చి 29: ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు అమ్ముకునే సంస్కృతి కాంగ్రేస్ పార్టీదని.. టీఆర్‌ఎస్‌దీ కాదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం మిర్యాలగూడ మండలం గూడురు గ్రామ శివారులో జరిగిన ఎన్నికల భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ తాను వేమిరెడ్డి నర్సింహారెడ్డి నుండి 100 కోట్ల రూపాయలు తీసుకుని టిక్కెట్ ఇచ్చానని విపక్షాలు ఆరోపిస్తున్నాయని.. ‘ఏమయ్యా.. నర్సింహారెడ్డి తీసుకున్నానా..?’ అని నిండు సభలో ఆయనను ప్రశ్నించగా లేదని పేర్కొన్నారు. అదే విధంగా టీఆర్‌ఎస్‌లో చేరిన భిక్షపతి యాదవ్, క్యామ మల్లేష్ తదితరులు ఉత్తమ్ కుమార్‌రెడ్డికి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇన్ని కోట్లు ఇచ్చామంటే ఇన్ని చెప్పారన్నారు. గెలిస్తే యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిలిపివేస్తామని చెప్పిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ప్రజలే మూసివేశారని ఎద్దేవా చేశారు. అదేవిధంగా ఎన్నికల అనంతరం పీసీసీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పదవీ ఊడటం ఖాయమన్నారు. ఎన్నికల్లో గెలవాల్సిన పార్టీలు కాదని ప్రజలని అప్పుడే ప్రజాస్వామ్యం పరిరక్షింపబడుతుందన్నారు. మే 23 తర్వాత దేశ పరిపాలన ప్రాంతీయపార్టీల చేతుల్లోకి రాబోతుందన్నారు. ఎన్నికల్లో బీజేపీకి 150, కాంగ్రెస్‌కు 100 సీట్ల కంటే ఎక్కువ రావన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్నారు. దేశానికి బీజేపీ, కాంగ్రెస్‌లు చేసేదేమి లేదని బోఫోర్స్, రాఫెల్ తప్ప అని విమర్శించారు. దేశంలో సామాన్య ప్రజానీకానికి ఏం కావాలనే ఆలోచన లేదన్నారు. తాను దేశం కోసం ఆలోచిస్తున్నానని దేశం కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఫెడరల్ ప్రభుత్వం ద్వారా అమలు చేసి చూపిస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కంటే కేంద్రం ఆయుష్మాన్ భవ అధ్వాన్నమన్నారు. రైతు బంధు పథకాన్ని కేంద్రం కాపీ కొట్టిందన్నారు. 24,000 కోట్ల రూపాయల వ్యయంతో దామరచర్ల మండలంలో నిర్మించే మెగా థర్మల్ పవర్ ప్లాంట్ పూర్తయితే నల్లగొండ జిల్లా ముఖచిత్రం మారిపోతుందని పేర్కొన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 18,000 మంది ఉపాధి పొందుతారని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ డ్యాంలో 137 టీఎంసీ డెడ్ స్టోరేజ్ ఉన్న ఏప్రిల్ 15 వరకు నీటిని పంపుల ద్వారా తోడి అయిన ఆయకట్టు రైతులకు అందిస్తానని పేర్కొన్నారు. పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి గెలిచినట్టే సభ నిరూపిస్తున్నదన్నారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు కాదు భారతదేశానికి పరిపాలన అందించే సత్తా ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. అందుకు నిదర్శనంగా గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో అందించిన పాలనయేనన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ సెక్రటరి జనరల్ కే.కేశవరావు, ప్రధాన కార్యదర్శి టీ.రవీందర్‌రావు, మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, నోముల నర్సింహయ్య, రవీంద్రకుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, కంచర్ల భూపాల్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మాజీ ఎమ్మెల్యేలు తిప్పన విజయసింహారెడ్డి, వి.చందర్‌రావులు పాల్గొన్నారు.

డమీలుగా టీఆర్‌ఎస్ ఎంపీలు
అసమర్థ పాలనను వీర సైనికుల్లా తిప్పి కొట్టాలి
నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
పెద్దఅడిశర్లపల్లి, మార్చి 29: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అసమర్థ పాలనను తిప్పికొట్టేందుకు ప్రతి ఒక్క కార్యకర్త వీర సైనికుల్లా పోరాడాల్సిన అవసరం ఉందని నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకుని శుక్రవారం మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ సంపాదనతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారానికి పాల్పడుతుందన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలను శాసిస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2014లో టీఆర్‌ఎస్‌కు 11 ఎంపీ స్థానాలు రాగా పార్టీ ఫిరాయింపులతో మరో ముగ్గురిని టీఆర్‌ఎస్‌లోకి చేర్చుకోవడంతో 14 మంది అయ్యారన్నారు. అయనప్పటికీ ఏమీ సాధించలేక పోయామని వారే ఒప్పుకున్నారని నాడు ఏమీ చేయలేని వారు నేడు ఏం చేస్తారని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో 542 ఎంపీ స్థానాలకు 16ఎంపీ స్థానాలతోనే రాజకీయాన్ని శాసిస్తాననడం, ఎంతవరకు నిజమో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఎంపీలు డమీలుగా తయారయ్యారని ఎద్దేవా చేశారు. నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను చిత్తుగా ఓడించామని, రాబోయే ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించబోతుందనడానికి ఇదే సాంకేతికమన్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది అమ్ముడు పోతున్నారని, అమ్ముడు పోయేవారికి, కొనేవారికి ఇద్దరికి సిగ్గులేకుండా పోయిందన్నారు. స్వాతంత్య్రాన్ని తెచ్చింది, తెలంగాణను తెచ్చింది కాంగ్రెస్ పార్టీనేయని, అలాంటి పార్టీ నుండి ఎవరు బయటి వెళ్లినా పట్టించుకోనవసరం లేదన్నారు. వెనుకబడిన దేవరకొండ నియోజకవర్గాన్ని ప్రగతి వైపు నడిపించేందుకు సర్వశక్తులు ఓడ్చి అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జానారెడ్డి, జడ్పీ చైర్మన్ బాలు నాయక్, నియోజకవర్గ ఇన్‌చార్జి జగన్‌లాల్ నాయక్, అలుగుబెల్లి వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీపీ రాజమ్మ, వైస్ ఎంపీపీ గాశీరామ్, పార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, రవికుమార్, సత్యంరెడ్డి, ధర్మారెడ్డి, జల్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లోనూ 2018 ఫలితాలే..
* అన్నదమ్ములు కలిసి వచ్చినా బూర గెలుపును ఆపలేరు
* రాజ్యసభ సభ్యుడు బడుగుల, ఎంపీ అభ్యర్థి బూర
మర్రిగూడ, మార్చి 29: పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో భువనగిరి నియోజకవర్గంలో 2018 ఎన్నికల ఫలితాలే మళ్లీ పునరావృతమవుతాయని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌లు అన్నారు. శుక్రవారంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా లెంకలపల్లి, దామెరభీమనపల్లి గ్రామాల మీదుగా మండల కేంద్రం వరకు రోడ్డు షో నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కోమటిరెడ్డి బ్రదర్స్ ఎన్ని ఎత్తుగడలు 2014లో రాజగోపాల్ రెడ్డికి పట్టిన గతే 2019లో కోమటిరెడ్డికి పడుతుందని విమర్శించారు. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్సీ, ప్రస్తుత ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ఎన్నికలను డబ్బు మయం చేశారని, పదవి కాంక్ష తప్పా ప్రజలకు సేవ చేయాలనే తపన వారికి లేదన్నారు. మఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రాన్ని శాసించే స్థాయిలో ఎంపీలను గెలుచుకోవాల్సిన అవసరం ఉందని బూరను భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమి నియోజకవర్గ ప్రజలకు తీవ్ర లోటని, మరోసారి కోమటిరెడ్డి బ్రదర్స్ చేతిలో మోసపోకుండా టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. భువనగిరి పార్లమెంట్ స్థానంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు జల్ల మార్కండేయులు, మునగాల నారాయణ రావు, మండల అధ్యక్షుడు దంటు జగదీశ్వర్, పాశం సురేందర్ రెడ్డి, జిల్లా నాయకులు బచ్చు రామకృష్ణ, పందుల రాములు గౌడ్, చెరుకు లింగం గౌడ్, కే. రాజునాయక్, మునగాల అంతిరెడ్డి, గంట కృష్ణ, సర్పంచ్‌లు నల్ల యాదయ్య, మునగాల సుధాకర్‌రావు, స్వాతి నవీన్‌రెడ్డి, వర్కాల వెంకటేశ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్ లక్ష్యాన్ని నెరవేర్చాలి
* ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత
గుండాల, మార్చి 29: రాష్ట్రంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 16 మంది టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపించుకుని కేంద్రాన్ని శాసించే స్థాయికి ఎదగాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యాన్ని ప్రజలు నెరవేర్చాలని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రాజ్‌కమల్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ బూర నర్సయ్య గౌడ్ ఎంపీగా ఉన్నప్పుడు భువనగిరి ప్రాంతాన్ని ఐదు వేల కోట్లతో అభివృద్ధి పరిచి బీబీ నగర్ ఎయిమ్స్ ఆసుపత్రి, కేంద్రీయ విద్యాలయం, జాతీయ రహదారుల అభివృద్ధి చేశారని వివరించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్ రెడ్డి, నాయకులు మోతె పిచ్చిరెడ్డి, ఎంపీపీ సంగి వేణుగోపాల్, జడ్పీటీసీ మందడి రామకృష్ణారెడ్డి, ఇమ్మడి దశరధ, గడ్డమీది పాండరి, గార్లపాటి సోమరెడ్డి, చిందం ప్రకాశ్, బండా రమేష్ రెడ్డి, రాసుకచ్చుల పద్మనాభం, ఎం.ఏ. రహీం, మద్దుల బాల్‌రెడ్డి, మూగల శ్రీనివాస్, చిందం ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్ లక్ష్యాన్ని నెరవేర్చాలి
* ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత
గుండాల, మార్చి 29: రాష్ట్రంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 16 మంది టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపించుకుని కేంద్రాన్ని శాసించే స్థాయికి ఎదగాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యాన్ని ప్రజలు నెరవేర్చాలని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ బూర నర్సయ్య గౌడ్ ఎంపీగా ఉన్నప్పుడు భువనగిరి ప్రాంతాన్ని ఐదు వేల కోట్లతో అభివృద్ధి పరిచి బీబీ నగర్ ఎయిమ్స్ ఆసుపత్రి, కేంద్రీయ విద్యాలయం, జాతీయ రహదారుల అభివృద్ధి చేశారని వివరించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్ రెడ్డి, నాయకులు మోతె పిచ్చిరెడ్డి, ఎంపీపీ సంగి వేణుగోపాల్, జడ్పీటీసీ మందడి రామకృష్ణారెడ్డి, ఇమ్మడి దశరధ, గడ్డమీది పాండరి, గార్లపాటి సోమరెడ్డి, చిందం ప్రకాశ్, బండా రమేష్ రెడ్డి, రాసుకచ్చుల పద్మనాభం, ఎం.ఏ. రహీం, మద్దుల బాల్‌రెడ్డి, మూగల శ్రీనివాస్, చిందం ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.

వామపక్ష అభ్యర్థులను గెలిపించాలి
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి
దేవరకొండ, మార్చి 29: త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీలో ఉన్న వామపక్ష పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి కోరారు. శుక్రవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో జరిగిన దేవరకొండ నియోజకవర్గ సీపీఐ కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నల్లగొండ పార్లమెంట్ స్థానం నుండి సీపీఎం అభ్యర్థి మల్లు లక్ష్మి, భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి సీపీఐ అభ్యర్థి శ్రీరాములు పోటీలో ఉన్నారని చెప్పారు. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను బీజేపీ పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వల్ల ఎవరికి లాభం చేకూరిందని ప్రశ్నించారు. వామపక్ష పార్టీల అభ్యర్థులు గెలిస్తేనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. టీఆర్‌ఎస్, బీజేపీలను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పల్లా నర్సింహారెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు ఉజ్జిని యాదగిరిరావు, పల్లా దేవేందర్‌రెడ్డి, కే. కాంతయ్య, బీ. వెంకటరమణ, తూం బుచ్చిరెడ్డి, కే.కేశవరెడ్డి, బీ. వెంకటయ్య, పాండురంగారెడ్డి, అచ్చయ్య, యుగేందర్‌రావు, పట్టణ కార్యదర్శి జూలూరు వెంకట్‌రాములు తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా నిత్యారాధనలు
యాదగిరిగుట్ట, మార్చి 29: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారి నిత్యారాధనలు, అభిషేకాలు, ఆర్జిత సేవలు శాస్తయ్రుక్తంగా సాగాయి. లక్ష్మీనరసింహుల ఆలయంలో వేకువ జామున సుప్రభాతంతో స్వామి అమ్మవార్లను మేల్కొలిపి హారతి నివేదన చేశారు. బిందె తీర్థం, బాలభోగంతో ఆలయ పూజాధికాలు ప్రారంభించారు. ముందుగా స్వయంభూవులను ఆరాధించిన పూజారులు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలతో కొలిచారు. వివిధ సుగంధ ద్రవ్యాలతో, పూలమాలలతో పట్టు వస్త్రాలతో, ఆభరణాలతో సుందరంగా అలంకరించి అర్చించారు. కవచమూర్తులను స్వర్ణ పుష్పాలతో ఆరాధించారు. ఆలయ కల్యాణ మండపంలో అర్చక బృందం వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణానికి ముందు విశ్వక్సేనారాధన, పుణ్యహావచనం, శ్రీ సుదర్శన నారసింహహోమం, గజవాహన సేవోత్సవాలు నిర్వహించారు. నిత్యకల్యాణోత్సవంతో పాటు బాలాలయంలో ఉదయ నుండి సాయత్రం వరకు కొనసాగిన సహస్రనామార్చన, అష్టోత్తర పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు వెండిజోడి సేవ నిర్వహించారు.
ఎంపీగా వేమిరెడ్డిని ఆశీర్వదించండి
* సతీమణి ఇందిర, కూతుర్ల ప్రచారం
రామగిరి, మార్చి 29: నల్లగొండ పార్లమెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి గెలుపు కోరుతూ శుక్రవారం నల్లగొండలో ఆయన సతీమణి ఇందిర, కూతుర్లు కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహిళలకు బొట్టుపెట్టి ఓట్లు అభ్యర్థించారు. వ్యాపార రంగంలో రాణించిన వేమిరెడ్డి సంపాదన కోసం కాకుండా ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారని, ఆయనను ఆశీర్వదించి గెలిపిస్తే నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేస్తారని అన్నారు. వారి వెంట టీఆర్‌ఎస్ నాయకులు మధు, మోహన్ పాల్గొన్నారు.
నల్లగొండలో మల్లు లక్ష్మి ప్రచారం
నల్లగొండ రూరల్, మార్చి 29: మండలంలో శుక్రవారం సీపీఎం పార్లమెంట్ అభ్యర్థి మల్లు లక్ష్మి విస్తృత ప్రచారం నిర్వహించారు. మండలంలోని పెద్దసూరారం, చందనపల్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను పార్టీలకు అతీతంగా గెలిపించాలని కోరారు. నల్లగొండ పార్లమెంట్‌కు మొదటిసారిగా మహిళా అభ్యర్థిగా బరిలో ఉన్నానని మేధావులు, విద్యావంతులు, మహిళలు తనకు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, పాలడుగు నాగార్జున, సయ్యద్ హషం, సత్తయ్య, విప్లవ్‌కుమార్, ప్రభావతి, సైదులు, అశోక్‌రెడ్డి, భిక్షం, ఇస్తారి, గోపాల్, లింగయ్య, నర్సింహ, సత్యనారాయణ, జానయ్య, వెంకటమ్మ, సైదమ్మ తదితరులున్నారు.