నల్గొండ

మిషన్ భగీరథతో ఫ్లోరోసిస్‌ను తరిమేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట రూరల్, మే 27:తెలంగాణ రాష్ట్ర ప్రజల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని,నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిన్‌తో బాద పడుతున్న ప్రజలు మిషన్ భగీరథతో మంచినీటి అవసరాలు తీరనున్నాయని ఎమ్మెల్సీ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట పరిధిలోని గుండ్లపల్లి,యాదగిరిపల్లి కమ్యునిటీ హాల్‌లకు ప్రభుత్వ విప్ గొంగిడి సునిత మహేంధర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి శంకుస్థాపన చేసిన అనంతరం విలేకరుల సమావేవంలో మాట్లాడుతూ నల్లగొండ జిల్లా ప్రజలు ప్లోరోసిస్‌తో ఎంతో బాదపడుతున్నారని అందుకే మిషన్ భగీరధ తో ప్రతి గ్రామంతోపాటు పట్టణంలోని ప్రజల మంచి నీటి అవసరాలు తీరనున్నాయన్నారు.బంగారు తెలంగాణ కేసిఆర్‌తోనే సాధ్యమని రాష్ట్ర పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని,మిషన్ భగీరథతో దేశ విదేశాలలో తెలంగాణ ప్రతిష్ట పెరిగిందన్నారు. తెలంగాణాలోనే ప్రసిద్ద పుణ్యక్షేత్రంగా,ఆధ్యాత్మిక కేంద్రంగా యాదాద్రి అభివృద్ది చెందుతుందన్నారు.తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందకు ఎన్నో కుట్రలు పనుతున్న ప్రతిపక్ష పార్టీలకు ఎన్నికల్లో ప్రజలకు తగిన బుద్ది చెబుతున్నా వారి తీరు మారటంలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం నాయకులు గొంగిడి మహేందర్‌రెడ్డి,జడ్‌పిటిసి కర్రె కమలమ్మ,ఎంపిపి గడ్డమీది స్వప్నరవీందర్‌గౌడ్,ఎంపీటీసీలు సీస కృష్ణ,గుండ్లపల్లి శత్రజ్ఞ,కైరంకొండ వినోద్, సర్పంచ్ బూడిద స్వామి,సింగిల్ విండో డైరెక్టర్ పేరబోయిన సత్యనారాయణ,టిఆర్‌ఎస్ నాయకులు ఆరె యాదగిరి,కాటబత్తిని అంజనేయులు,అంకం నర్సింహ్మ,రవీందర్‌గౌడ్,కర్రె వెంకటయ్య, కీసరిబాలరాజు,గ్యాదపాక బాల్‌నర్సయ్య,పాండు పాల్గొన్నారు.