నల్గొండ

ఆర్‌జెసి ర్యాంకర్‌కు అభినందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట రూరల్, మే 27:ఎస్‌ఎస్‌సి ఫలితాల్లో మండల టాపర్‌గా టిఎస్‌ఆర్‌జేసిలో 116వ స్టేట్ ర్యాంకు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముఖ్యర్ల రమ్యను ప్రభుత్వ విప్ గొంగిడి సునిత మహేందర్‌రెడ్డి అభినందించారు. శుక్రవారం పట్టణంలో వివిధ అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొన్న ప్రభుత్వ విప్ సునిత ఎస్‌ఎస్‌సి పలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినికి శాలువా కప్పి అభినందించారు. తల్లి దండ్రులు నిరక్షరాస్యులైనప్పటికీ రమ్య కష్టపడి ఉత్తమ ప్రతిభ కనబరిచిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తోందని విద్యార్ధులు విద్యపైన దృష్టి సారించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు.ఆలేరు నియోజక వర్గాన్ని మెరుగైన విద్యార్ధులను తయారు చేసే కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ఎస్‌వీఎన్ మాంటిస్సోరీ స్కూల్ పట్టణంలో ఉత్తమ విద్యార్ధులను తయారు చేస్తోందని, ఉత్తమ విద్యతో పాటు క్రమ శిక్షణను విద్యార్ధులకు అందిస్తూ అహర్నిశలు కృషి చేస్తున్న స్కూల్ ఫౌండర్ గొట్టిపర్తి భాస్కర్‌ను ఆమె అభినందించారు.కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ప్రభృతులు పాల్గొన్నారు.