నల్గొండ

ఎవరు ముందు...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మే 30: సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్. భాస్కర్‌రావులు టిఆర్‌ఎస్‌లో చేరుతారాన్న ప్రచారం ప్రస్తుతం నల్లగొండ జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. వీరిలో వెంకట్‌రెడ్డి జూన్ 6న టిఆర్‌ఎస్‌లో చేరుతారంటు బలమైన ప్రచారం సాగుతుండగా ఆయన కంటే ముందుగానే గుత్తా, భాస్కర్‌రావులు టిఆర్‌ఎస్‌లో చేరుతారంటు మరో ప్రచారం సాగుతుంది. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయిలో ఒక నాయకుడి అజమాయిషి కనిపించకపోవడం, టిఆర్‌ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌కు విపక్షాలు బలహీన పడిపోవడం వంటి కారణాలను విశే్లషించుకుంటూ జిల్లాల వారీగా కాంగ్రెస్ నేతలు ఎవరి ప్రయోజనాలు వారు చూసుకోవడమే మేలని తలచి కారెక్కేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్న నల్లగొండ జిల్లాకు చెందిన పిసిసి చీఫ్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సిఎల్పీ నేత కె.జానారెడ్డి, ఉప నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ మంత్రి ఆర్. దామోదర్‌రెడ్డిల మధ్య ఐక్యత కొరవడటం పార్టీ అభివృద్ధికి గుదిబండగా మారింది. ఒకరంటే ఒకరికి పొసగని పరిస్థితుల్లో ఇతరులు రాజకీయంగా బలహీన పడితే బాగుండన్న రీతిలో వర్గపోరు సాగిస్తున్నారు. ఈ పరిస్థితులను అనుకూలంగా మలుచుకున్న టిఆర్‌ఎస్ జిల్లా కాంగ్రెస్ నుండి కీలక నేతలను కారెక్కించేందుకు గత కొంత కాలంగా తెరవెనుక ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. కాంగ్రెస్‌కు మళ్లీ మంచి రోజులు రావచ్చన్న అంచనాలతో ఇంతకాలంగా పార్టీ మారడంపై జిల్లా కాంగ్రెస్ పెద్దలు అయిష్టత చూపారు. అయితే నానాటికి కెసిఆర్ హవా పెరిగిపోతుందని, కాంగ్రెస్ భవిష్యత్‌పై అయోమయం కనిపిస్తుందని భావిస్తున్న కొందరు చివరకు టిఆర్‌ఎస్‌లో చేరే దిశగా అడుగులేస్తున్నట్లుగా గత పక్షం రోజులుగా జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది.
భవిష్యత్‌పై భరోసా దక్కాకే పార్టీ మార్పు !
జిల్లా కాంగ్రెస్ నుండి ముందుగా సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జూన్ 6న సీఎం కెసిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరుతారని తెలుస్తోంది. తన రాజకీయ భవితవ్యంపై కెసిఆర్ నుండి స్పష్టమైన హామీలు దక్కినందునే వెంకట్‌రెడ్డి కారెక్కేందుకు సిద్ధమయ్యారని అనుచర వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న వెంకట్‌రెడ్డి తిరిగి రాగానే పార్టీ మారుతారని తెలుస్తోంది. అయితే అన్న వెంకట్‌రెడ్డి పార్టీ మారుతున్నారన్న ప్రచారాన్ని తమ్ముడు ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి ఖండిస్తున్నారు. తానైతే కాంగ్రెస్‌ను వీడబోనంటు ప్రకటించారు. అయితే కీలక మంత్రి పదవి, వచ్చే ఎన్నికల్లో అనుచరులకు ఆరు టికెట్లు, ఎస్‌ఎల్‌బిసి-బ్రహ్మణవెల్లంల ప్రాజెక్టు పూర్తిలపై తగిన హామీలు దక్కాకే వెంకట్‌రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని అనుచర వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి చేరికపై జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డికి, పార్టీ ఇతర నేతలకు కూడా కెసిఆర్ సర్ధి చెప్పారని, జిల్లాల విభజన నేపథ్యంలో పార్టీ బలోపేతానికై వెంకట్‌రెడ్డి చేరికను స్వాగతించాలంటూ చెప్పారని రెండు పార్టీల్లో చర్చలు సాగుతున్నాయి. అయితే కాంగ్రెస్‌లోని వెంకట్‌రెడ్డి ప్రత్యర్ధి వర్గమే ఆయన పార్టీ మారుతున్నారంటు ప్రచారం చేయిస్తున్నారన్న వాదన సైతం వినిపిస్తోంది. వెంకట్‌రెడ్డి కంటే ముందుగానే ఎంపి గుత్తా, ఎమ్మెల్యే భాస్కర్‌రావులు పార్టీ మారుతారన్న మరో ప్రచారం కాంగ్రెస్ శ్రేణుల్లో షికారు చేస్తోంది. ఇంతకు వారిలో కాంగ్రెస్ నుండి టిఆర్‌ఎస్‌లోకి ఎవరు ముందు చేరుతారో లేదో స్పష్టత లేకపోయినా తాజా ప్రచారాలు క్యాడర్‌ను గందరగోళంలో పడేశాయి.