నల్గొండ

మండల సభ బహిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామన్నపేట, మే 31: ప్రజలు తమను గెలిపించి రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు ప్రభుత్వం తమకు నిధులు, విధులు ప్రకటించకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం జరిగిన మండల పరిషత్ సమావేశాన్ని ఎంపిటిసిలు బహిష్కరించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి కక్కిరేణి ఎల్లమ్మవిజయ్‌కుమార్ అద్యక్షతన సమావేశం ప్రారంభం కాగానే సిపిఎం, సిపిఐ, బిజేపి, కాంగ్రెస్, టిడిపికి చెందిన ఎంపిటిసిలు మూకుమ్మడిగాలేచి ప్రభుత్వం నుండి తమకు ఏరకమైన నిధులు, విధులు స్పష్టంగా కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ తాము సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి సమావేశ మందిరం నుండి బయటకు వెళ్లారు. అనంతరం కార్యాలయం ప్రధాన ద్వారం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపిటిసిల ఫోరం మండల అద్యక్షుడు కూరెళ్ల నర్సింహ్మచారి మాట్లాడుతూ తాము ఎన్నికలలో గెలిచినప్పటి నుండి ఇప్పటివరకు తమకు ఏవిధమైన నిధులు, విధులలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని అన్నారు. ప్రతి ఎంపిటిసికి సంవత్సరానికి పదిలక్షల రూపాయల నిధులు కేటాయించాలని, గ్రామపంచాయతి కార్యాలయాలలో ఎంపిటిసిలకు తగిన స్థానం కల్పించాలని ఆయన డిమాండు చేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపిపి బద్దుల ఉమారమేష్, ఎంపిటిసిలు ఆకవరపు మధుబాబు, పున్న వెంకటేశం, కనె్నకంటి వెంకటేశ్వరాచారి, ఊట్కూరి శోభానర్సింహ్మ, మంటి సరోజ, మేకల భద్రమ్మ, కోఆప్షన్ సభ్యుడు ఎండి.రెహాన్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా మంగళవారం జరుగవలసిన మండల పరిషత్ సమావేశాన్ని ఎంపిటిసిలు బహిష్కరించడంతో సమావేశం నిర్వహించడానికి తగిన కోరం లేనందునా సమావేశాన్ని బుధవారం నాటికి వాయిదావేస్తున్నట్లు ఎంపిడివో కె.జానకిరెడ్డి తెలిపారు.