నల్గొండ

ఎన్నికల నియమాళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 28: జిల్లా స్ధానిక సంస్ధల శాసన మండలి నియోజకవర్గం ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం నిర్ధేశించిన ఎన్నికల ప్రవర్తన నియమావళిని అన్ని రాజకీయ పక్షాలు విధిగా పాటించాలని ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి స్పష్టం చేశారు. శనివారం కలెక్టర్ చాంబర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వాహణపై వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతు మండలి ఎన్నికల నోటిఫికేషన్ డిసెంబర్ 2న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నామినేషన్లను సమర్పించుటకు డిసెంబర్ 9చివరి తేదిగా పరిగణించాలన్నారు. 10న నామినేషన్ల పరిశీలన జరుపుతారని, 12న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుందన్నారు. శాసన మండలి ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 27న ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు జరుగుతుందన్నారు. 30వ తేది ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ప్రక్రియ జరుగుతుందన్నారు. ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా జిల్లా సంయుక్త కలెక్టర్, సహాయ అధికారిగా ఆర్డీవోలు వ్యవహరిస్తారన్నారు. జిల్లాలో శాసనమండలి ఎన్నికల దృష్ట్యా ఐదు రెవెన్యూ డివిజన్‌లలో ఐదు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు.
నల్లగొండలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, మిర్యాలగూడలో జడ్పీ హెచ్‌ఎస్ బకల్వాడ, భువనగిరిలో మండల పరిషత్ కార్యాలయం, సూర్యాపేటలో మండల పరిషత్ కార్యాలయం, దేవరకొండలో మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తారని, ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం పోలింగ్ కేంద్రాలలో ఏమైనా మార్పులు ఉంటే రాజకీయ పక్షాలతో సమావేశమై తెలియజేస్తామన్నారు. జిల్లాలో మొత్తం స్థానిక సంస్థల ఓటర్ల సంఖ్య 1110ఉండగా, స్ర్తిలు 622, పురుషులు 488 మంది ఉన్నారన్నారు. ఈ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని, పోలింగ్ సరళీని పూర్తి అయ్యేవరకు వీడియో కవరేజ్ జరుగుతుందని, ఇందుకు గాను ఐదుగురు మైక్రో అబ్జర్వర్లు ఉంటారన్నారు. ఫోటో ఓటర్, గుర్తింపు కార్డు ఇవ్వటం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జీ జెసి వెంకట్రావ్, డిఆర్‌వో రవి, కాంగ్రెస్ పార్టీ సాయి సంపత్‌రెడ్డి, ఎస్.కె. ఇంతియాజ్, టిడిపి నుండి పిల్లి రామారాజు, మిర్యాల యాదగిరి, టిఆర్‌ఎస్ నుంచి జవహార్‌లాల్‌రావు, మనె్నం శ్రీనివాస్, సిపిఎం నుంచి పి.నర్సిరెడ్డి, సిపిఐ నుంచి కె. కాంతయ్య, బిఎస్పీ నుంచి సిద్దార్ద్థ పూలే పాల్గొన్నారు.

మహిళలపై పెరుగుతున్న
హింసను ప్రతిఘటించాలి
నల్లగొండ రూరల్, నవంబర్ 28 : మహిళలపై రోజురోజుకు హింస, వేధింపులు పెరుగుతున్నాయని, వాటిని ప్రతిఘటించాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. శనివారం స్ధానిక దీప్తి నర్సింగ్ కళాశాలలో మహిళలపై హింసను ప్రతిఘటిద్దాం అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో తమ శక్తి సామర్ధ్యాలు నిరూపించుకుంటూ మహిళలు ఎందులోనూ తక్కువ కాదని చరిత్ర సృష్టిస్తుంటే మరోవైపు మహిళలపై వివక్షత, చిన్నచూపు, అత్యాచారాలు, బాల్య వివాహలు, ఆడపిల్లల అమ్మకాలు నేటికి కొనసాగుతున్నాయన్నారు. దీనిని ప్రతిఘటించాల్సిన అవసరం విద్యార్ధి, యువతపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానాచార్యులు వనజారెడ్డి, ఐద్వా డివిజన్ కార్యదర్శి కొండ అనురాధ, తుమ్మల పద్మ, ఝూన్సీ తదితరులు ఉన్నారు.