నల్గొండ

వికలాంగులకు రుణాలు మంజూరు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, జూన్ 6: జిల్లాలోని వికలాంగులకు 2015-16సంవత్సరానికి సంబందించిన రుణాలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు చింతల సైదులు సోమవారం కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు వారి అంగీకార పత్రంతో, మండల అభివృద్ధి అధికారి సమ్మతితో సుమారు 65మందికి పైగా వికలాంగులు రుణాల సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్నారని, వారికి ఇంత వరకు మంజూరు కాకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగుల సహాయ సంచాలకులు నూతనంగా దరఖాస్తులు స్వీకరించి కొత్తవారికి మాత్రమే సబ్సిడీ మంజూరు చేయడం జరుగుతుందని తెలుపుతున్నారని, దీని ఫలితంగా స్వయం ఉపాధికొరకు దరఖాస్తు చేసుకున్న 65మంది విలకలాంగులకు అన్యాయం జరుగుతుందన్నారు. కావున వెంటనే వికలాంగులకు సబ్సిడీ మంజూరు చేయాలని గ్రీవెన్స్ సందర్భంగా జెసి సత్యనారాయణకు వినతి పత్రం అందించారు. ఈ నిరసన తెలిపిన వారిలో జిల్లా ఉపాధ్యక్షులు మేడ యాదగిరి, పరమేశం,కృష్ణ, పరిమల, కొండల్, నగేష్, వెంకటేష్ తదితరులు పాలొన్నారు.

ఎమ్మెల్యేపై విమర్శలు సరికాదు
రామగిరి, జూన్ 6: నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై అనుచిత విమర్శలు చేయడం సరికాదని మండల పార్టీ అధ్యక్షుడు ఒంగూరి లక్ష్మయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు పెరిక మల్లిఖార్జున్, సర్పంచ్ ఈశ్వర్‌లు పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే వెంకట్‌రెడ్డి ఇంట్లో సోమవారం ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. విలువలేని మనిషి మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదన్నారు. టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండేటి వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణలోని పది జిల్లాల కార్యకర్తల శ్రమ ఫలితంగానే గెలుపొందారు తప్ప తమ వల్లనే గెలిచారనడం సమంజసంగా లేదన్నారు. కొంత మంది అదిష్టానం తొత్తులుగా వ్యవహరిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. గతంలో ఎమ్మెల్యే వెంకట్‌రెడ్డి వెంట తిరుగుతూ నకిరేకల్ ఎమ్మెల్యే టికెట్‌కోసం ప్రయత్నించిన వ్యక్తి ఇలా మాట్లాడడం నీచ రాజకీయాలను ప్రోత్సహించినట్లవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రవి, రాజేష్, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆంధ్రా జడ్జిలు ఎపికి వెళ్లాలని రాస్తారోకో

నల్లగొండ లీగల్, జూన్ 6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన న్యాయమూర్తులు తెలంగాణ రాష్ట్రంలోనే పని చేస్తామని హైకోర్టుకు తెలియజేయడం మూలంగా తెలంగాణ ప్రాంత న్యాయమూర్తులకు, న్యాయవాదులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, వెంటనే ఆంధ్రా న్యాయమూర్తులు ఎపి తరలి వెళ్లాలని డిమాండ్ చేస్తూ సోమవారం కోర్డు విధులను బహిష్కరించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లగొండ బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కల్లూరి యాదయ్య, కొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రా న్యాయమూర్తులు తెలంగాణలో ఉండరాదని, తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈనెల 13వరకు అందుకు నిరసనగా కోర్టు విధులను బహిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ రాస్తారోకోలో జిల్లా న్యాయవాదులు గోలి అమరెందర్‌రెడ్డి, నూకల నర్సింహ్మరెడ్డి, మిర్యాల లెనిన్‌బాబు, జవహర్‌లాల్, భీమార్జున్‌రెడ్డి, లింగాచారి, ఎ.శంకరయ్య, కిషోర్ కుమార్, దర్శనం నర్సింహ్మ, మంద నగేష్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగుల నిరసన ప్రదర్శన
ఆంధ్రా న్యాయమూర్తులు ఎపి వెళ్లాలని డిమాండ్ చేస్తూ సోమవారం నల్లగొండ కోర్టు ఉద్యోగులు భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జిలు దరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన నిరసనలో ఉద్యోగుల సంఘం అధ్యక్షులు దేవిరెడ్డి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ హైకోర్టు ఉమ్మడిగా ఉండడం మూలంగా తెలంగాణ కోర్టు ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ప్రత్యేక హై కోర్టు ఏర్పడితే తెలంగాణ ఉద్యోగులకు పదోన్నతులతోపాటు కొత్త ఉద్యోగాలు లభిస్తాయన్నారు.

పనులను వేగవంతం చేయాలి

* నాగార్జునసాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ సునీల్

దామరచర్ల, జూన్ 6: కృష్ణపుష్కరాల పనులను వేగవంతం చేయాలని నాగార్జునసాగర్ ప్రాజెక్టు చీఫ్‌ఇంజనీర్ సునీల్ తెలిపారు. ఆయన సోమవారం మండలంలోని వాడపల్లి వద్దగల కృష్ణానది సమీపంలోని పుష్కరఘాట్ల పనులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరఘాట్ల పనులు నత్తనడకన సాగుతున్నాయని పని వేగవంతం చేయని వారిపై చర్యలు తీసుకుంటామని, అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన భాద్యత ఉందని, అతి త్వరగా పనులను ముగించాలని ఉద్దేశ్యంతో జూలై చివరి నాటికి పనులు పూర్తిచేసే విధంగా ప్రణాళికలు చేపడుతున్నామని, జిల్లాలో 33 ఘాట్లలో పనులు జరుగుతున్నాయని, పనులలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు. ఆయన వెంట ఐబి డిఇ మురళి, ఆర్.గోపాల్, ఐబి జెఇ జనార్ధన్ ఉన్నారు.

11న గులాబీ గూటికి గుత్తా ..?

కోమటిరెడ్డిపై వేటు పడేనా..!

నల్లగొండ, జూన్ 6: నల్లగొండ కాంగ్రెస్ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, సిఎల్పీ ఉపనేత, నల్లగొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి టిఆర్‌ఎస్‌లో చేరే ప్రయత్నాల్లో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. సిఎం కెసిఆర్ ఇద్దరిలో ఎవరికి కారెక్కేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తారోనన్న చర్చలు రెండు పార్టీల శ్రేణుల్లో జోరుగా సాగుతున్నాయి. పార్టీ మారితే ఎంపి పదవికి రాజీనామా చేస్తానని, మళ్లీ ఎన్నికల్లో పోటీపై తనకు ఆసక్తి లేదని, ఎమ్మెల్సీతో మంత్రి పదవి ఇస్తే గులాబీ గూటికి చేరుతానంటు గుత్తా తన మనోగతాన్ని కెసిఆర్‌కు ఇప్పటికే నివేదించారు. కెసిఆర్ నుండి దీనిపై స్పష్టత వస్తే ఈ నెల 11న గుత్తా టిఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లుగా అనుచర వర్గాల్లో ప్రచారం సాగుతుంది. నల్లగొండ జిల్లాలో టిఆర్‌ఎస్ బలోపేతానికి గుత్తా చేరిక ఉపకరిస్తుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది.
ఇదిలావుండగా, మంత్రి టి.హరీష్‌రావుతో భేటీ పిదప పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై విమర్శలు గుప్పించి షోకాజ్ నోటీస్‌కు గురైన సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోనుందనన్న ఆంశం ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తికరంగా మారింది. కోమటిరెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తారంటూ కొందరు..సస్పెన్షన్‌కు ముందే పార్టీ మారుతారంటూ మరికొందరు రకరకాలుగా ఊహాగానాలతో కార్యకర్తలు రచ్చబండ చర్చల్లో మునిగారు. టిఆర్‌ఎస్‌లో చేరే క్రమంలోనే పిసిసి చీఫ్ ఉత్తమ్‌పై వెంకట్‌రెడ్డి అనుచిత విమర్శలు గుప్పించారని కాంగ్రెస్ సీనియర్లలో ఎక్కువ మంది భావిస్తున్న నేపథ్యంలో పార్టీ నుండి ఆయనను సాగనంపే అవకాశం లేకపోలేదన్న చర్చ ఎక్కువగా సాగుతోంది. అయితే కోమటిరెడ్డి మాత్రం కాంగ్రెస్‌లో షోకాజ్‌లు మాములేనని తాను పార్టీ మారుతున్నానడంలో వాస్తవం లేదంటూ కొట్టిపారేస్తున్నారు. పార్టీ మార్పు నేపథ్యంలో తనపై వస్తున్న ప్రచారాన్ని బహిరంగంగా ఖండించనటువంటి గుత్తా నుండి ఎలాంటి వివరణ కోరని కాంగ్రెస్ అధిష్టానం కోమటిరెడ్డి విమర్శలపై మాత్రం షోకాజ్ జారీచేసి భిన్నంగా స్పందించడాన్ని కోమటిరెడ్డి అనుచరులు జీర్ణించుకోలేపోతున్నారు. ఏదేమైనా గుత్తా, కోమటిరెడ్డి పార్టీ మార్పు ప్రచారం..సొంత పార్టీ నాయకత్వంపై విమర్శల పర్వం గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ శ్రేణులను గందరగోళంలోకి నెట్టగా ఈ వ్యవహారానికి ఏ రకంగా తెరపడుతుందోనని వారంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నిమ్స్‌ను సందర్శించిన మంత్రి లక్ష్మారెడ్డి
బీబీనగర్, జూన్ 6: మండలంలోని రంగాపురం గ్రామంలోగల నిమ్స్ ఆసుపత్రిలో కొనసాగుతున్న వైద్యసేవలను సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కె.లక్ష్మారెడ్డి పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్యసేవలు పొందుతున్న రోగులతో ముఖాముఖి ముచ్చటించి వారికి అందుతున్న వైద్యచికిత్సలపై ఆరాతీశారు. రోగులకు అందిస్తున్న వైద్యచికిత్సలు, కావలసిన ఏర్పాట్లపై నిమ్స్ డైరెక్టర్ మనోహర్‌ను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట భువనగిరి ఎమ్‌ఎల్‌ఎ పైళ్ల శేఖర్‌రెడ్డి, డిప్యూటి డైరెక్టర్ కెటిరెడ్డి ఉన్నారు.
తిప్పర్తి పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ
తిప్పర్తి, జూన్ 6: తిప్పర్తిలోని పోలీస్ స్టేషన్‌ను జిల్లా నూతన ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తనిఖీలో స్థానిక ఎస్‌ఐ కొండల్‌రెడ్డి, ఎఎస్‌ఐ శ్రీహరి, సిబ్బంది ఉన్నారు.

‘పార్టీ నాయకత్వంపై కోమటిరెడ్డి విమర్శలు మానుకోవాలి‘
నల్లగొండ టౌన్, జూన్ 6: పిసిసి చీఫ్ ఉత్తమ్‌పైనా, ఇతర కాంగ్రెస్ సీనియర్లపైనా సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన అనుచిత విమర్శలను డిసిసి తీవ్రంగా ఖండిస్తుందని డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పాశం రాంరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిపక్ష స్థానంలో కష్టకాలంలో ఉన్న పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేలా కృషి చేయాల్సిన కోమటిరెడ్డి వంటి నాయకులు ఈ రకంగా పార్టీ నాయకత్వంపై విమర్శలు చేయడం సమంజసంగా లేదన్నారు. విబేధాలుంటే పార్టీ వేదికలపైనే చర్చించుకోవాలని లేదా అధిష్టానానికి ఫిర్యాదు చేసుకోవచ్చని అలాకాకుండా బహిరంగంగా పార్టీ నాయకులపై విమర్శలు చేయడం క్రమశిక్షణ కాదన్నారు. ఇకముందైనా కోమటిరెడ్డి ఈ తరహా అనుచిత విమర్శలు మానుకుని పార్టీ అభివృద్ధికి పాటుపడాలన్నారు.

టిఆర్‌ఎస్‌కు ధీటుగా బిజెపి

నల్లగొండ టౌన్, జూన్ 6: తెలంగాణలో 2019 ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీకి ధీటుగా బిజెపిని బలోపేతం చేయాలని ఎమ్మెల్సీ రామచందర్‌రావు కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం బిజెపి రాష్ట్ర నాయకులు పల్లెబోయిన శ్యాంసుందర్ గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ఈనెల 10న బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్‌షా భహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. నరేంద్రమోది రెండు సంవత్సరాల పాలనలో ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, రాజకీయ దురహంకారంతోనే టిఆర్‌ఎస్ వ్యవహరిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుందాన్నారు. బంగారు తెలంగాణను పక్కదారిపట్టిస్తూ ఇతర పార్టీల నాయకులను ప్రలోబ పెడుతూ ఫిరాయింపుల తెలంగాణాగా మారుస్తుందన్నారు. 2019 ఎన్నికల లక్ష్యంగా బిజెపి బలమైన పార్టీగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు బూతు స్థాయి వరకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణలో యాదాద్రి పవర్ ప్లాంట్‌తోపాటు, మూత పడిపోయిన రామగుండం ఫర్టిలైజర్ కర్మాగారాన్ని పునఃప్రారంభించడం వల్ల వేల మందికి ఉద్యోగాలు లభింప చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. హార్టికల్చర్ యూనివర్సిటీతోపాటు 43వేల కోట్లు జాతీయ రహదారుల కోసమే కేంద్ర ప్రభుత్వం కేటాయించడం పట్ల రాష్ట్ర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. లక్షా 30వేల కోట్లు 14వ అర్ధిక సంఘం నిధులను మంజూరు చేయడం కేంద్ర ప్రభుత్వ ఘనతగా భావించాలన్నారు. హడ్‌కోకు 4వేల కోట్లు మంజూరు చేసిందన్నారు. ఒక కిలో బియ్యం ఆహార బధ్రత పథకంలో కిలోకు 27రూపాయల భారం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం కేంవలం 2రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఇన్ని చేస్తున్నా కేంద్రంపై అబాండాలు వేసి అప వాదులు విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. ఈ మహాసభలో తెంలగాణలో బిజెపి 2019 ఎన్నికలు లక్ష్యంగా రణభేరి మోగిస్తుందన్నారు. తెలంగాణ హైకోర్టు విభజనకు బిజెపి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆంధ్రా హైకోర్టు నిర్మాణానికి నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్దంగా ఉందన్నారు. సమావేశంలో కిసాన్‌మోర్చ రాష్ట్ర అధ్యక్షులు గోలి మధుసుదన్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు పల్లెబోయిన శ్యాంసుందర్, ఓరుగంటి రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి బాకి పాపయ్య, ఉపాధ్యక్షుడు పోతెపాక సాంబయ్య పాల్గొన్నారు.

గ్రీవెనె్సస్‌డేలో వినతుల వెల్లువ
కలెక్టరేట్(నల్లగొండ), జూన్ 6: వివిధ సమస్యల పరిష్కారంకోసం సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెనె్సస్‌డేలో వినతులు అధిక సంఖ్యలో వెల్లువెత్తాయి. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన గ్రామాల ప్రజలు తాగు నీటి సమస్యలు, ఆసరా పించన్లు, ఆహార భద్రతా కార్డులు, పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు చెల్లించాలని, భూ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా నలుమూలల నుండి తరలి వచ్చి ఆయా శాఖల అధికారులకు అధిక సంఖ్యలో వినతులు సమర్పించారు. వికలాంగులకు రుణాలు మంజూరు చేయాలని కోరుతూ ఆ సంఘం నాయకులు కలెక్టరేట్ ముందు నిరసన తెలిపి జెసి సత్యనారాయణకు వినతినందించారు. నిడమనూరు మండలం, సూరేపల్లి గ్రామ రెవెన్యూ శివారు కొట్టాల గ్రామ పరిధిలో సర్వేనంబర్ 28లో రెండెకరాల భూమి, పట్టా పాసుపుస్తకము ఇచ్చినా ఆక్రమణకు గురైందని, తనకు న్యాయం చేయాలంటూ ఆదిమూలం కృష్ణమ్మ, వినతినందించారు. తనకు పెండింగ్ ఇందిరమ్మ బిల్లు వెంటనే ఇప్పించాలంటూ అదే మండలంలోని ముప్పారం గ్రామానికి చెందిన అవిరెండ్ల సైదయ్య వినతినందించారు. నిబంధనలకు విరుద్ధంగా కళాశాలల్లో అడ్మిషన్లు పొందే విద్యార్థుల నుండి వేలాది రూపాయలు అడ్మిషన్ ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఎస్సీ, ఎస్టీ, విద్యార్థి సంఘం నాయకులు కట్టెల శివకుమార్, కంబాలపల్లి విజయ్‌కాంత్, రవిరాల రాజు, సతీష్, శ్రీకాంత్ తదితరులు వినతినందించారు. బీకర గాలి వానలకు ఇంటి పైకప్పు, సిమెంట్ రేకులు లేచిపోయి ఇంట్లో ఉన్న ధాన్యం, సామాగ్రి తడిచి నష్టపోయామని, ప్రభుత్వం నుండి వెంటనే నష్టపరిహారం ఇప్పించాలంటూ నిడమనూరు మండలం, ముప్పారం గ్రామానికి చెందిన మేకల కృష్ణయ్య వినతినందించారు. అనుముల మండలానికి సంబంధించి వివిధ కార్పొరేషన్ల ద్వారా 2015-16 వార్షిక ప్రణాళికలో భాగంగా మంజూరైన రుణాల లబ్దిదారుల ఎంపికలో ఈవోఆర్‌డి, ఎండివో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, వెంటనే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని అదే మండలానికి చెందిన చింతమల్ల శ్రీనివాస్ వినతినందించారు. సూర్యాపేట తొలి ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్ కుటుంబానికి ఇంటి స్థలం, పక్కా ఇల్లు మంజూరు చేయాలంటూ అతని కుటుంబ సభ్యులు ఉప్పల అజయ్, సంపంగి కొమరమ్మ, సైదులు, సిపిఐ జిల్లా కార్యదర్శి మల్లేపల్లి ఆదిరెడ్డి, రసుకుల మట్టయ్య, వరికుప్పల వెంకన్న, వీరన్న, సందీప్, సైదమ్మ, ఇంద్రకంటి లక్ష్మీ తదితరులు వినతినందించారు.