నల్గొండ

నిబంధనలు పాటించని స్కూలు బస్సులపై కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, జూన్ 7: పాఠశాలలు పునఃప్రారంభవౌతున్న నేపధ్యంలో విద్యార్థులను రవాణా చేసే విద్యా సంస్థల నిబందనలు పాటించని పాఠశాలల, కళాశాలల బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని డిటిసి చంద్రశేఖర్‌గౌడ్ పాఠశాలల, కళాశాలల యాజమాన్యాలను హెచ్చరించారు. మంగళవారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ 15సంవత్సరాల కాలపరిమితి దాటిన విద్యాసంస్థల బస్సులపై ప్రభుత్వం నిషేదం విధించిందని, విద్యార్థులను రవాణా చేయడానికి వాటిని వినియోగిస్తే సంబంధిత యాజమాన్యాలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 14వందలకు పైగా విద్యా సంస్థల బస్సులు ఉండగా ఇప్పటివరకు 7వందల బస్సులు మాత్రమే ఫిట్‌నెస్ సర్ట్ఫికెట్‌ను పొందాయని, వారం రోజుల లోగా మిగతా 7వందల బస్సులను సంబందిత వాహన తనిఖీ అధికారులచే తనిఖీ చేయించి ఫిట్‌నెస్ సర్ట్ఫికెట్ పొందాలని సూచించారు. నిబందనలకు లోబడి లేని బస్సులకు ఫిట్‌నెస్ సర్ట్ఫికెట్ జారీ చేయబడదని, ఎంవిఎ ఇచ్చిన సూచనలతో బస్సులను సరిచేయించి తీసుకురావాలని సూచించారు. విద్యాసంస్థల బస్సుల నిర్వహన యాజమాన్యాల బాధ్యతగా భావించాలని కోరారు. ప్రతి బస్సుతో సుశిక్షితుడైన డ్రైవర్‌తోపాటు, క్లీనర్, విద్యార్థులను రోడ్డు దాటించేందుకు సహాయకులు కూడా తప్పనిసరిగా ఉండాలని, బస్సు నంబర్‌తోపాటు వారి వివరాలను తమ కార్యాలయంలో అందిస్తేనే ఫిట్‌నెస్ లభిస్తుందన్నారు. జూన్ 13 తరువాత నిరంతర తనిఖీల్లో ఎప్పుడు పట్టుబడ్డా బస్సులు సీజ్ చేస్తామన్నారు. బస్సులలో ప్రయానించే విద్యార్థుల వివరాలతోపాటు ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఏర్పాటు చేయాలన్నారు. 60సంవత్సరాల వయసు మించిన డ్రైవర్లను ఏర్పాటు చేయవద్దని, అవసరమైతే వారికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు విద్యార్థుల తల్లిదండ్రులు, బస్సుల యాజమాన్యాలు సహకరించాలని కోరారు. ఆటోలలో పరిమితికి మించిన విద్యార్థులను తరలించ రాదని, సెలవు దినాల్లో స్కూల్ బస్సులను ఇతర కార్యక్రమాలకు వనియోగించరాదని పేర్కొన్నారు.