నల్గొండ

సహకారం సంఘం మహాజన సభలో గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, మార్చి 17: జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో గురువారం నిర్వహించిన సహకారం సంఘం మహాజన సభ సమావేశంలో చేనేత రుణాల మాఫీపై గందరగోళం నెలకొంది. ముందుగా గతంలో ఆమోదించిన తీర్మాణాలను దృవీకరించి అర్ధవార్షిక బ్యాంకు పరిపాలన నివేధికలు, ఆమోదించిన విషయాలు, జమా ఖర్చులు, లాభనష్టాల విషయాలపై చర్చ జరిగింది. గత ఖరీఫ్ నుందు దీర్గకాలిక రుణాలు, బంగారు ఆభరణముల అప్పులు, స్వల్పకాలిక రుణాలు, బ్యాంకు ఖాతాల నుండి సబ్సిడీ పథకం, రైతు వ్యక్తిగత భీమా సౌకర్యం, ప్రధానమంత్రి జీవనజ్యోతి, సురక్ష భీమా యోజన పథకాలు, గృహ రుణాలు, ఉద్యోగుల సమస్యలపై చర్చించడం జరిగింది. కాగా చేనేత రుణాల మాఫీ 2010లోనే జరిగినప్పటికి చేనేత సహకారం సంస్థకు త్రిబుల్ ఆర్ స్కీం కింద వచ్చిన డబ్బులను వడ్డీ ఉందని పట్టి వేస్తున్నారని పలు మార్లు విన్నవించినా ఫలితం లేదని చేనేత సహకార సంఘం రాష్ట్ర నాయకులు, మాజీ డిసిసిబి అధ్యక్షులు గర్దస్ బాలయ్య, సభ్యులు ఆందోళనకు దిగడంతో సభలో రసాబాస నెలకొంది. వెంటనే డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు స్పందించి కమిటీ వేస్తానని, వారం రోజుల్లో సమస్య పరిష్కారమయ్యే దిశగా కృషి చేస్తానని, రెండు,మూడు జిల్లాలలో డిసిసిబి అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో డిసివో సాయప్ప, సిఈవో మధన్‌మోహన్, నాబార్డ్ డిడిఎం దయామృత, డైరక్టర్లు పాల్గొన్నారు.