నల్గొండ

మిర్యాలగూడ జిలా ల కోసం 18న నియోజకవర్గం బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, జూన్ 12: మిర్యాలగూడ రెవిన్యూ డివిజన్‌ను జిల్లాగా చేయాలని కోరుతూ ఈ నెల 18న మిర్యాలగూడ నియోజకవర్గం బంద్‌ను నిర్వహించాలని అన్ని వర్గాల వారిని అఖిలపక్ష సమావేశం కోరింది. ఆదివారం స్థానిక తెలంగాణా అమరవీరుల స్ధూపం వద్ద తెలంగాణా మట్టిమనుషుల వేదిక వ్యవస్థాపకులు వేనేపల్లి పాండురంగారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ పార్టీల, స్వచ్ఛంధ సంస్థల నాయకులు మాట్లాడుతూ మిర్యాలగూడ పార్లమెంట్ నియోజకవర్గం పేరు లేకుండా కొంతమంది రాజకీయ నాయకులు చేశారని, నేడు జిల్లా కాకుండా చేస్తున్నారని ఆరోపించారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు ప్రాంతంలో ఉన్న మిర్యాలగూడ అన్ని విధాలా జిల్లా కేంద్రానికి కావాల్సిన వనరులున్నాయని వారు అన్నారు. ఎన్‌ఎస్‌పి, పాత వ్యవసాయ మార్కెట్ యార్డు ఖాళీ స్థలాలు కార్యాలయ సముదాయాల నిర్మాణానికి అనుకూలంగా ఉన్నాయని, ఇంకా స్టేట్ హైవే, రైలు మార్గం ఉందని వారు అన్నారు. జిల్లాకోసం పోరాడాలని, జిల్లా కాని పక్షంలో మిర్యాలగూడ నియోజకవర్గాన్ని నల్లగొండ జిల్లాలోనే ఉంచాలన్న ప్రతిపాదనను కొంతమంది చేశారు. 10వేల సంతకాలు సేకరించామని, 17న జిల్లా కలెక్టర్‌కు సమర్పిస్తామని సమావేశంలో తెలిపారు. సమావేశంలో ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి వస్కుల మట్టయ్య, సిపిఐ మండల కార్యదర్శి బంటు వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు డి.స్కైలాబ్‌నాయక్ ఎండి.కరీం, టిడిపి, బిజెపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పాదురి ప్రసాద్, కాసుల సత్యం, సుదర్శన్‌గౌడ్, వనం మదన్‌మోహన్, ఎ.రాంచంద్రారెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు జొన్నలగడ్డ రంగారెడ్డి, ఎక్కలశెట్టి రాము, ఉబ్బపల్లి కాశయ్య, బొలసాని కృష్ణయ్య, ప్రజా సైన్స్‌వేదిక ఆరోగ్య కమిటి కన్వీనర్ డాక్టర్ మువ్వా రామారావు, ఐఎంఎ కార్యదర్శి డాక్టర్ జె.రాజు, బిసి సంఘ నాయకులు టి.అశోక్, ఆర్‌టిసి నాయకులు లక్ష్మానాయక్, సామాజిక కార్యకర్తలు శ్యామల నాగసేనారెడ్డి, పి.సోమయ్య, ఉపాధ్యాయ సంఘ నాయకులు పి.యాదగిరి, డి.అంజయ్య, డేగ విటి, కుందా శ్రీనివాస్, జర్నలిస్టుల సంక్షేమ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.