నల్గొండ

కించిత్ కర్తవ్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, జూన్ 14: నిన్నటి వరకు దేవరకొండ రాజకీయాన్ని శాసించిన జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలూనాయక్ తన రాజకీయ భవిష్యత్తు ఏంటన్నది తెలియక తీవ్రమైన ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ ప్రత్యర్థులు ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌లు అధికార పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం అవడంతో బాలూనాయక్ తన రాజకీయ భవిష్యత్తుపై గత రెండు రోజులుగా తీవ్రమైన చర్చలు సాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి జడ్పీటీసిగా గెలిచి జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికైన బాలూనాయక్ తదనంతర రాజకీయ పరిణామాలతో టిఆర్‌ఎస్ లో చేరారు. పార్టీలో చేరిన వెంటనే బాలూనాయక్‌కు కెసిఆర్ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ బాధ్యతలను కూడా అప్పగించారు. దీంతో నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి బాలూనాయక్ తీవ్రంగా కృషి చేశారు. వివిధ పార్టీల్లో ఉన్న తన అనుచరులను అధికార పార్టీ కండువాలు కప్పుకునేలా చేశారు. బాలూనాయక్ కృషి వల్ల నియోజకవర్గంలో టిఆర్ ఎస్ అనూహ్యంగా బలం పుంజుకున్న మాట వాస్తవం. అధికార పార్టీ నాయకునిగా తన మాటే నెగ్గాలని అధికారులు తాను చెప్పిన మాటే వినాలని బాలూనాయక్ అధికారులపై ఒత్తిళ్ళు తీసుకురావడం ఎమ్మెల్యే హోదాలో రవీంద్రకుమార్ చిన్న చిన్న పనులను కూడా చేయించుకోలేక పోవడంతో తన ప్రత్యర్ధిని దెబ్బతీసే విధంగా రవీంద్రకుమార్ పార్టీ మారే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం దేవరకొండ మండలం పడ్మట్‌పల్లి గ్రామంలో సిపిఐ, టిఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన వివాదంలో సిపిఐ కార్యకర్తలను పోలీస్‌స్టేషన్‌కు అప్పగించి కోర్టులో రిమాండ్ చేయాలని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ చెప్పినా అధికారపార్టీ నాయకునిగా జిల్లా పరిషత్‌చైర్మెన్ బాలూనాయక్ పోలీస్‌లపై ఒత్తిళ్ళు తీసుకొచ్చి సిపిఐ కార్యకర్తలను కొట్టించాడని వచ్చిన ఆరోపణలతో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ స్వయంగా పోలీస్‌ల తీరును నిరసిస్తూ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించిన విషయం అప్పట్లో సంచలనం కలిగించింది. నియోజకవర్గానికి ఎమ్మెల్యేను అయినా అధికార పార్టీ నాయకుడినన్న కారణంతో బాలూనాయక్ ప్రతి పనికి తనకు అడ్డురావడాన్ని జీర్ణించుకోలేకే రవీంద్రకుమార్ టి ఆర్‌ఎస్‌లో చేరినట్లు తెలుస్తోంది. మరో వైపు కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా పార్టీని వీడి టిఆర్ ఎస్‌లోచేరుతుండడంతో భవిష్యత్తులో సిపిఐ తరపున పోటీ చేసినా గెలిచే పరిస్థితులు లేనందున రాజకీయ భవిష్యత్తును ఊహించే రవీంద్రకుమార్ టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్ళు తనకు రాజకీయ ప్రత్యర్ధులుగా ఉన్న ఎంపి గుత్తా, ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌లు ఇద్దరూ ఒకే సారి టిఆర్‌ఎస్‌లో చేరుతుండడంతో బాలూనాయక్ తన అనుచరులతో గత రెండు రోజులుగా సుదీర్ఘమంతనాలు జరుపుతున్నారు. ఇన్నాళ్ళు నియోజకవర్గంలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న తనకు ఏ విధంగా న్యాయం చేస్తారని జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి వద్ద బాలూనాయక్ తన ఆవేదనను వెలిబుచ్చినట్లు సమాచారం. పార్టీకోసం పనిచేసిన వారికి ఎప్పుడూ న్యాయం జరుగుతుందని ఎలాంటి ఆందోళన వద్దని తాను అండగా ఉంటానని మంత్రి జగదీశ్‌రెడ్డి హామీ ఇచ్చినా, బాలూనాయక్ తన రాజకీయ భవిష్యత్తుపై కాసింత ఆందోళనగా ఉన్నట్లు తెలుస్తోంది. బాలూనాయక్ టిఆర్‌ఎస్‌లో చేరక ముందు ఉద్యమ సమయంలో పని చేసిన వారిని కాదని ఎన్నికల ముందు పార్టీలో చేరిన కేతావత్ లాలూనాయక్‌కు నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించిన కెసిఆర్ ఆయనకు టిఆర్‌ఎస్ టిక్కెట్ ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేయించారు. లాలూనాయక్ పార్టీ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఉద్యమ సమయంలో పార్టీ జెండాను మోసిన వారిని పక్కకు పెట్టి తనకంటూ సొంత క్యాడర్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. లాలూనాయక్ కన్నా రాజకీయంగా బలవంతుడైన బాలూనాయక్‌కు కెసి ఆర్ పార్టీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. దీంతో లాలూనాయక్ పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. బాలూనాయక్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా తన కంటూ ప్రత్యేకమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు బాలూనాయక్ కంటే రాజకీయంగా బలమైన నాయకుడు ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పార్టీలో చేరుతున్నందున బాలూనాయక్ రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అనూహ్యంగా రాజకీయ సమీకరణలు మారనున్న నేపధ్యంలో భవిష్యత్తులో దేవరకొండలో ఏ నాయకుడు హీరోగా మారుతాడో కాలం నిర్ణయించనుంది.