నల్గొండ

భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, జూన్ 16: ఆగస్టు నెలలో వచ్చే కృష్ణాపుష్కరాలకు తరలివచ్చే పుష్కర భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డిజిపి అంజన్‌కుమార్ తెలిపారు. పుష్కరఘాట్ల ఏర్పాట్లపై ఏరియల్ సర్వేకై వచ్చిన ఆయన నాగార్జునసాగర్‌లో హెలిప్యాడ్ వద్ద విలేఖరులతో మాట్లాడుతూ కృష్ణానది పుష్కరాలు ప్రశాంతంగా ఎటువంటి అసౌకర్యం లేకుండా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు కృష్ణానది పుష్కరాలకు తెలంగాణ రాష్ట్రం ఎంతో శ్రద్ధతో ఏర్పాటుచేస్తుందన్నారు. దీనికై ప్రస్తుతం కృష్ణానదిలో నీరు తక్కువగా ఉందని 2,3వారాలలో రాబోయే వర్షాల కారణంగా నీటిమట్టం పెరగవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు ఏర్పాటుచేయాల్సిన వసతులు, ట్రాఫిక్ క్రమబద్దీకరణ, రోడ్డు పనులు మొత్తం కూడా శ్రద్ధతో పర్యవేక్షిస్తున్నామన్నారు. గత పుష్కరాల కంటే మూడు రెట్లు అధికంగా పుష్కరఘాట్లను ఏర్పాటుచేస్తున్నామన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలకు సంబంధించిన అన్ని పనులు జూలై 28వరకు పూర్తిచేస్తామన్నారు. జనవరిలో డిజిపి అనురాగ్‌శర్మ ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం ఆయన సూచించిన ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నల్లగొండ జిల్లాలో గతంలో 522మీటర్ల పుష్కరఘాట్లను ఏర్పాటుచేయగా ప్రస్తుతం 2,652మీటర్ల మేరకు పుష్కరఘాట్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. గత పుష్కరాలలో 11పుష్కరఘాట్లే ఉండగా ప్రస్తుతం జిల్లా మొత్తంలో 28పుష్కరఘాట్లను ఏర్పాటుచేస్తున్నామన్నారు. దీంతోపాటు రోడ్డు వెడల్పు, ట్రాఫిక్, పార్కింగ్ స్థలం విషయంలో పుష్కర భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూస్తున్నామన్నారు. జిల్లాలో 1000ఎకరాల స్థలాన్ని పుష్కరాలకు వచ్చే వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాటుచేస్తున్నట్లుగా తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు. ఆయనతోపాటు డిఐజి సబ్రవాల్, ఐజి నాగిరెడ్డి, ఆర్డీఓ కిషన్‌రావు, డిఎస్‌పి గోనెసందీప్ తదితరులు ఉన్నారు.