నెల్లూరు

నివాసాలకు 16, నివాసేతరాలకు 18 శాతం పన్నుల నిర్ధారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ, మార్చి 18: కోదాడ పట్టణంలో వందల శాతం పెరిగిన ఇంటిపన్నులతో ఆగ్రహించిన ప్రజలు అఖిలపక్షం, టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఆద్వర్యంలో చేస్తున్న ఆందోళనలతో స్పందించిన మున్సిపల్ ఛైర్‌పర్సన్ వంటిపులి అనిత శుక్రవారం మున్సిపాలిటీలోని తన చాంబర్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఛైర్‌పర్సన్ అనిత మాట్లాడుతూ ఇంటిపన్నుల నిర్ధారణలో అవగాహనలోపం జరిగిందని దానికి బాధ్యత అధికారులదని ఆరోపించారు. ఇంటిపన్నుల తగ్గింపుకు కౌన్సిల్ అనుకూలంగా వున్నా అధికారుల నిర్లక్ష్యం కారణంగా అమల్లో జాప్యం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటిపన్నులను తగ్గిస్తూ ఈనెల 14వ, తేదిన కౌన్సిల్ చేసిన తీర్మాణాన్ని తాను దగ్గరుండి మినిట్స్ పుస్తకంలో అతికించాల్సిన పరిస్దితి మున్సిపాలిటీలో వుందన్నారు. ప్రజలపై మోపిన ఇంటిపన్నుల భారాన్ని తగ్గించేందుకు కౌన్సిల్ ఏకగ్రీవంగా చేసిన తీర్మాణంలో భాగంగా నివాసాలకు 16 శాతం, నివాసేతర భవనాలకు 18 శాతంగా ఇంటిపన్నుల రేట్లను తగ్గించినట్లు ఆమె ప్రకటించారు. ఇంటికొలతల్లో వ్యత్యాసం వస్తే సరిచేసేందుకు చర్యలు తీసుకొంటామని, రీరివిజన్ చేయిస్తామని అనిత హమీ ఇచ్చారు. మాజీసర్పంచ్ పైడిమర్రి సత్యబాబు మాట్లాడుతూ జోన్‌లు, సబ్‌జోన్‌ల సంఖ్యను పెంచి అక్కడున్న అద్దెలు, ప్లింత్ ఏరియాను ప్రమాణంగా తీసుకొని ఇంటిపన్నులను నిర్ధారించాలని డిమాండ్ చేశారు. పైడిమర్రి వెంకటనారాయణ మాట్లాడుతూ బిల్లింగ్ వయస్సు ఆధారంగా తరుగుదల ఇవ్వాలని, నోటీసుల్లో గత సంవత్సరం చెల్లించిన అద్దెలను పేర్కొనలేదని చెప్పారు. మున్సిపాలిటీలో సమర్పించిన రివిజన్ పిటీషన్‌లపై చర్యలు తీసుకోలేదని ఆయన ద్వజమెత్తారు.