నల్గొండ

జయశంకర్‌సార్‌కు ఘన నివాళులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, జూన్ 21: తెలంగాణ జాతిపిత, దివంగత ఫ్రొఫెసర్ జయశంకర్‌సార్ ఐదవ వర్థంతి వేడుకలు నల్లగొండ పట్టణంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గడియారం సెంటర్‌లోని అమర వీరుల స్థూపం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ జాగృతి, తెలంగాణ విద్యావంతుల వేదిక, జిల్లా గ్రంధాలయ శాఖ, డిఎన్‌ఆర్ ప్రజా సేవాసమితి, టిఆర్‌ఎస్, టిఆర్‌ఎస్‌విల ఆధ్వర్యంలో, వివిధ విద్యా సంస్థలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జయశంకర్ వర్థంతిని ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ చేసిన కృషిని తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో ఆయన పడిన తపనను అంతా స్మరించుకున్నారు. ఆయా కార్యక్రమాలలో కవి రచయిత వేణుసంకోజు, జాగృతి జిల్లా కన్వీనర్ భోనగిరి దేవేందర్, విద్యావంతుల వేదిక ప్రధాన కార్యదర్శి పందుల సైదులు, నిరుద్యోగ జెఎసి అధ్యక్షుడు పాల్వాయి రవి, డిఎన్‌ఆర్ సేవా సమితి పట్టణ అధ్యక్షుడు ఎస్‌కె అహ్మద్, సింగారపు విజయ్, బొల్లు సైదులు, టిఆర్‌ఎస్‌వి నేత బొమ్మరబోయిన నాగార్జున, రమేష్, సత్యనారాయణ, పోలెపల్లి నగేష్ పాల్గొన్నారు. లుకానస్ పాఠశాలలో జరిగిన యోగా దినోత్సవం, జయశంకర్ వర్థంతి కార్యక్రమంలో ఎస్‌ఐ నాగదుర్గా ప్రసాద్, కోఆర్డినేటర్ ఆర్.మంగారెడ్డి, కరస్పాండెంట్ బి.కేశవులు, ప్రిన్సిపాల్ గోపాల్‌రెడ్డి, పుష్పలత, హరిత, భవిత,అనిత పాల్గొన్నారు.
జిల్లా కేంద్ర గ్రంధాలయంలో జయశంకర్ వర్థంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అల్లం ప్రభాకర్‌రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జయశంకర్ స్పూర్తితో బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రంధాలయాలకు పోటీ పరీక్షలకు పుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్స్ కట్టా నాగయ్య, పి.నాగేశ్వర్‌రావు, ఎం.నిర్మలాదేవి, వి.నర్సయ్య, కె.మూర్తి, డి.శ్రీనివాసరావు, కె.అనిత, ఎ.శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.