నెల్లూరు

నిరుద్యోగులకు రెడ్ సిగ్నల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, మార్చి 18: జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామక ప్రక్రియలో జిల్లా యంత్రాంగం అనుసరిస్తున్న తీరు విమర్శలకు గురవుతుంది. జిల్లాలో ఆర్‌డబ్ల్యుఎస్ విభాగంలో ఉన్న ఖాళీల కారణంగా వేసవిలో నీటి ఎద్దడి సమస్యల పరిష్కారంతో పాటు వాటర్ గ్రిడ్ పనుల నిర్వాహణకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఇటీవల జిల్లా ఆర్‌డబ్ల్యుఎస్ విభాగం అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 79మంది వర్క్ ఇన్‌స్పెక్టర్ల పోస్టుల భర్తీకి పూనుకుంది. బిటెక్ సివిల్ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ డిప్లోమా అర్హత ఉన్న 1500మంది అభ్యర్థుల నుండి దరఖాస్తులు సైతం స్వీకరించింది. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ఎంపిక కోసం టెండర్లు పిలువగా 29ఏజెన్సీలు ఒక శాతం లెస్‌తో టెండర్ వేశాయి. వారిలో డ్రా పద్ధతి ద్వారా ఒక ఏజెన్సీని ఎంపిక చేయడం వివాదస్పమైంది. నిబంధనలకు విరుద్ధంగా టెండర్ ప్రక్రియలో డ్రా పద్ధతితో ఏజెన్సీ ఎంపిక చేయడం వెనుక మతలబుపై సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో సదరు నియామక ప్రక్రియకు సంబంధించిన ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ పంపించిన ఫైల్‌ను కలెక్టర్ వద్ధ నెల రోజులుగా పెండింగ్‌లో పడింది. ఏజెన్సీ ఎంపిక వివాదం కాస్తా ఇంజనీరింగ్ నిరుద్యోగుల పాలిట శాపంగా మారి వారిని ఉద్యోగవకాశాల కోసం నిరీక్షణలో పడేసినట్లయింది. ఉద్యోగ ప్రక్రియ ఎంతవరకు వచ్చిందంటు నిరుద్యోగ ఇంజనీరింగ్ అభ్యర్థులు నిత్యం ఆర్‌డబ్ల్యుఎస్ కార్యాలయం చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక కమిటీలో కలెక్టర్, కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్‌మెంట్, జిల్లా ఎంఫ్లాయిమెంట్ ఆఫీసర్‌లు సభ్యులుగా ఉన్నారు. ఇది ఇలా ఉండగా తాజాగా కలెక్టరేట్ పరిపాలన విభాగం నుండి జిల్లా శిక్షణ కేంద్రం లో శిక్షణా కోఆర్డీనేటర్లుగా పనిచేసేందుకు రిటైర్డు ఉద్యోగుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తు కలెక్టర్ పేరుతో ప్రకటన వెలువడింది. రిటైర్డ్ జాయిం ట్ డైరక్టర్స్, అసిస్టెంట్, డిప్యూటీ డైరక్టర్స్, డిప్యూటీ కలెక్టర్స్, తహశీల్ధార్స్ తత్సమాన క్యాడర్ రిటైర్డ్ ఉద్యోగుల నుండి దరఖాస్తులు కోరారు. ఎంపికైన వారికి 20వేల రెమ్యూనరేషన్‌తో ఏప్రిల్ 1నుండి ఉద్యోగాల్లోకి తీసుకోనున్నారు. ఇందుకు నేడు ఇంటర్వ్యూ సైతం నిర్వహించనున్నారు. అయితే జిల్లా యంత్రాంగం ఉద్యోగాల భర్తీలో ప్రాధాన్యతను విస్మరిస్తున్నారని తక్షణం ప్రజల అవసరాలతో కూడిన తాగునీటి వ్యవస్థలో ఉద్యోగాల భర్తీని పెండింగ్‌లో పెట్టి, ఇప్పటికే రిటైరయినా ఉద్యోగులతో కూడిన ఉద్యోగ భర్తీ ప్రక్రియను శరవేగంగా చేపడుతున్నాంటు నిరుద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వం ఆర్‌డబ్ల్యుఎస్‌తో పాటు జిల్లాలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి తక్షణమే చర్యలు తీసుకొన్నట్లయితే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న కొంతమందికైనా ఉద్యోగ భాగ్యం దక్కుతుందని ఈ దిశగా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని నిరుద్యోగ సంఘాలు కోరుతున్నాయి.