నల్గొండ

జిల్లా హరితహారానికి 11న సిఎం కెసిఆర్ రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూన్ 24: జిల్లాలో జరిగే హరిత హారం కార్యక్రమానికి ఈ నెల 11న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరుకానున్నందునా జిల్లా ప్రజలంతా ఉద్యమంలా పండుగ వాతావరణంలో ప్రతి ఒక్కరు ఒక మొక్క చొప్పున నాటేందుకు ముందుకు రావాలని కలెక్టర్ పి.సత్యనారాయణ కోరారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు నిర్వహించిన హరిత హారం అవగాహాన సన్నాహక సదస్సులో ఆయన మాట్లాడుతు నూటికి నూరుశాతం అంతా మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 25శాతం నుండి 33శాతంకు పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన హరిత హారంలో విద్యాసంస్థలన్ని సామాజిక బాధ్యతగా భాగస్వామ్యం కావాలన్నార. జిల్లాలో 33శాతం ఉండాల్సిన అటవీ శాతం కేవలం 6శాతం మాత్రమే ఉందన్నారు. దీంతో తరుచు జిల్లా కరవు బారిన పడుతుందని వర్షాలు సరిగా పడటం లేదన్నారు. జిల్లా ప్రజలు ఎదుర్కోంటున్న ప్లోరైడ్ సమస్య నివారణకు ఇంటి ఆవరణలో సంబంధిత ఉసిరి, తులసి, మునగ వంటి మొక్కలను నాటుకోవాలన్నారు. కళాశాలలు, పాఠశాలల వారిగా ఎన్ని మొక్కలు నాటుతారో నిర్ధారించుకుని గుంతలు తీసుకుని, రక్షణ చర్యల ఏర్పాట్లు చేసుకుని మొక్కల కోసం అటవీ, డ్వామా అధికారులను సంప్రదించాలన్నారు. ఖాళీ స్థలాలు లేని కళాశాలల యాజమాన్యాలు పంచాయతీలు, పట్టణాల్లో వార్డులను దత్తత తీసుకుని ప్రతి ఇంటికి మొక్కలు నాటించే బాధ్యతను తీసుకోవాలన్నారు. కళాశాలల యాజమాన్యాలు హరిత హారంలో నాటేందుకు అవసరమైన మొక్కలను తీసుకుని నిర్ధేశించుకున్న ప్రాంతాల్లో డంపింగ్ చేసుకోవాలన్నారు. జెసి ఎన్. సత్యనారాయణ మాట్లాడుతు జిల్లాలో రైస్ మిల్లులు ఎక్కువగా ఉన్నందునా వాటి యాజమాన్యాలు కూడా ప్రణాళిక బద్ధంగా మొక్కలు నాటేందుకు అటవీ శాఖ అధికారుల సలహాలు తీసుకవాలన్నారు. మిల్లుల ఆవరణలో మొక్కలు నాటడంతో కాలుష్యం నియంత్రించవచ్చన్నారు. పరిశ్రమల దారులు తమ ఖాళీ స్థలాల్లో విధిగా మొక్కలు నాటాలన్నారు. ఈ సమావేశంలో డ్వామా పిడి దామోదర్‌రెడ్డి, డిఎస్‌వో అమృతారెడ్డి, డిఈవో చంద్రమోహన్, ఆర్‌ఐవో ప్రకాష్‌బాబు, మార్కెటింగ్ ఏడి అలీంలు పాల్గొన్నారు.