నల్గొండ

మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూన్ 30: మైనార్టీల అభివృద్ధికి సిఎం కెసిఆర్ ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని రాష్ట్ర విద్యుత్‌శాఖామంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ పట్టణంలో ముస్లింలకు ప్రభుత్వం నిర్ణయించిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మైనార్టీ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 71మైనార్టీ పాఠశాలలు మంజూరు చేయగా అందులో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో నాలుగు, భువనగిరిలో ఒకటి మంజూరైందన్నారు. 25కోట్ల చొప్పున పాఠశాలల నిర్మాణం జరుగుతుందన్నారు. విద్యపై భవిష్యత్తు ఆదారపడి ఉన్నందున మైనార్టీ విద్యార్థులను విద్యారంగంలో అభివృద్ధి చేసేందుకు జిల్లాలో మైనార్టీ గురుకుల పాఠశాలను కొత్తగా సూర్యాపేట, భువనగిరి, దేవరకొండ, కోదాడ, మిర్యాలగూడలలో ఏర్పాటు చేశామన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ఉన్నత ప్రమాణాలతో మైనార్టీ విద్యార్థులకు వాటి ద్వారా విద్యనందిస్తామన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు కొనసాగిస్తున్న ముస్లిం సోదరులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి, ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి, జెసి ఎన్.సత్యనారాయణ, ఆర్డీవో వెంకటాచారి, ఎమ్మెల్సీ పూల రవీందర్, స్థానిక టిఆర్‌ఎస్ నాయకులు దుబ్బాక నర్సింహ్మారెడ్డి, చాడ కిషన్‌రెడ్డి, ఫరిదుద్దీన్, జమాలుద్దీన్‌ఖాద్రి, ఎంపిపి పాశం రాంరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, పుల్లెంల వెంకటనారాయణగౌడ్ పాల్గొన్నారు.