నల్గొండ

రబీ ధాన్యం కొనుగోలుకు సన్నాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ: రబీ ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వ యంత్రాంగం అవసరమైన సన్నాహాలు చేపట్టింది. గత రబీ, ఖరీఫ్ సీజన్‌లలో రైతుల ధాన్యం కొనుగోలులో ఎదురైన ఇబ్బందుల నేపధ్యంలో ఈ దఫా రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోలు సజావుగా సాగేందుకు పౌరసరఫరాలు, మార్కెటింగ్, వ్యవసాయ, డిఆర్‌డిఏలు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నాయి. జిల్లాలో ఈ రబీ సీజన్‌లో 79152హెక్టార్లలో జరిగిన వరి సాగుతో 3,95,760మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు మార్కెట్‌కు వచ్చే ధాన్యం కొనుగోలుకు డిఆర్‌డిఏ ద్వారా 135ఐకేపి కేంద్రాలు, పిఏసిఎస్‌ల ద్వారా 82కేంద్రాలు మొత్తం 217కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. కనీస మద్ధతు ధర గ్రేడ్-ఏకు 1450, గ్రేడ్-2సాధారణ రకంకు 1400రూపాయలు చెల్లించనున్నారు. రైతులకు ధాన్యం డబ్బులను కొనుగోలు చేసిన 48గంటల్లో చెల్లించనుండగా ధాన్యం కొనుగోలు పర్యవేక్షణకు జిల్లా పౌరసరఫరాల మేనేజర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ సైతం ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో ధాన్యం అకాల వర్షాలతో తడువకుండా తగిన టార్ఫాలిన్లు, కొనుగోలుకు అవసరమైన తేమ నిర్ధారణ యంత్రాలు, గన్నీ బ్యాగ్‌లు, ప్యాడీ క్లీన్లు, ట్యాబ్‌లు, కాంటాలను సత్వరమే సమకూర్చాలని జాయింట్ కలెక్టర్ ఎన్. సత్యనారాయణ ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో ఒక టెక్నికల్ బృందంతో పాటు విఆర్‌వో పర్యవేక్షులుగా ఉంటారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా రైతులకు టోకెన్లు జారీ చేస్తారు. కొనుగోలు చేసిన ధాన్యం యార్డుల్లో నిల్వ ఉండకుండా వెంటనే రవాణా జరిగేలా చర్యలు తీసుకోనున్నారు.