నల్గొండ

సాగునీరు అందేనా....?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గరిడేపల్లి, జూలై 4 : తెలంగాణ అంతటా వర్షాలు పుష్కలంగా పడుతున్నాయి... ఇక సాగుపై సంశయమే లేదన్న తీరుగా ప్రచారం సాగుతన్న నేపధ్యంలో... ఆయకట్టులో ఏం జరుగుతుందో గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.... గత నాలుగురోజులుగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండగా.... ఆయకట్టులో మాత్రం అంతంతమాత్రంగానే వర్షాలు కురిసాయన్నది వాస్తవం... జూన్ నెలలో కనీసం వర్షపాతం నమోదుకాలేదన్నది...నిజం.. రెవిన్యూ రికార్డుల ప్రకారం మండలంలో జూన్ నెలలో కేవలం 132మి.మీ వర్షపాతం నమోదయ్యింది..దీనిని బట్టి ఆయకట్టులో ప్రస్తుత పరిస్థితి ఏమిటో ఇట్టే అర్ధమవుతుంది....అయినా ఈప్రాంతంలో వర్షాలు కురుస్తే భూగర్భజలాలు పెరిగి, చెరువులు నిండి...బోర్లు పనిచేసి పంటలు సాగుచేసే అవకాశం కొంతమంది రైతులకు లభిస్తుంది.... ఇది ఎంతమేరకు అన్నది పరిగణలోకి తీసుకుంటే నామమాత్రమేనన్న వాస్తవం బయల్పడుతుంది.... ఆయకట్టులో పూర్తిస్థాయిలో సాగు చేయాలంటే కృష్ణా నది నిండాలి...మహారాష్టల్రో పెద్ద ఎత్తున కురవాలి..తద్వారా నిండే కృష్ణానదిపై ఆయకట్టు భవిష్యత్తు ఆధారపడి ఉన్నదన్న విషయం అందరికి తెలిసిందే... ఎక్కడో వర్షాలు కురిశాయి...
ఈసారి సంతృప్తిగా ఉందని రాజకీయనాయకులు ప్రకటనలు గుప్పిస్తుంటే ఒకింత ఆశ్చర్యంగా ఉంది మరి....గత మూడు కార్లుగా ఆయకట్టులో కాలువకింద సాగు లేదు... ఈవిషయం అధికారులకు.... ప్రభుత్వానికి తెలుసు.. అయితే మాత్రం తీసుకున్న చర్యలు శూన్యం... ఏదైనా అంటే ఆయకట్టు అంటారు...
ఆయకట్టు అంటు ప్రత్యేక వివక్షకు గురవుతున్న విషయాన్ని ఈప్రాంత రాజకీయ ప్రతినిధులు, అధికారులు గమనించాల్సిన సమయం ఆసన్నమైంది. ఒకప్పుడు ఆయకట్టు అంటే రెండుకార్లు వరిపంట రైతులకు మంచి ఆదాయం అని నానుడి ఉంది... అదికూడా కాస్త వాస్తవమే... అయితే గత కొనే్నళ్లుగా సాగునీటిపై వడిదుడుకులు ఏర్పడుతుందనేది అందరికి తెలిసిన విషయమే... అయినా ముందు జాగ్రత్త ఏది... ఆయకట్టులో సాగుకు ఇబ్బంది కలుగుకుండా సాగర్ జలాశయంలో ఉన్న నీటిపై నియంత్రణలు ఏవి....? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాగునీటిపై కూడా రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్న ప్రతినిధులు..... ఇప్పుడు సాగునీటిపై రకరకాల సాకులు చెప్తున్నారు... గతంలోని పరిస్థితులకు బిన్నంగా ఇప్పుడు ఆయకట్టులో పరిస్థితులు నెలకొన్నాయి... వీటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా సాగర్ జలాశయంలో నీటిపై నియంత్రణ పెంచకుంటే మున్ముందు ఆయకట్టులో గడ్డుపరిస్థితులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇప్పటికైనా ఆయకట్టు పరిధిలోని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకొచ్చి సాగర్ ప్రాజెక్టు పరిధిలోని తెలంగాణ ఆయకట్టును పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పంటల సాగుపై ఖచ్చితమైన ప్రణాళికను రూపొందించి కఠినంగా కొంతకాలం అమలుచేయాల్సివుంది..వర్షాబావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా కనీసం ఒక ఏడాదిపాటు సాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రణాళికలు తయారుచేస్తే తప్ప మున్ముంది ఇటువంటి పరిస్థితులు ఎదురవుతుంటే మాత్రం ఆయకట్టులో సేద్యం అసాద్యంగా మారటం తప్పదుమరి.