నల్గొండ

సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు: చెరుపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, జూలై 4: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో సిపిఎం శ్రేణులు ప్రజాసమస్యలపై ఉద్యమించాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అన్నారు. సోమవారం తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 70వ వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతు రాష్ట్రంలో రైతు సమస్యలు పెరిగిపోయాయని, కుల వృత్తులు, చేతి వృత్తులు కునారిల్లాయన్నారు. జూలై 4న దొడ్డి కొమురయ్య అమరుడైన రోజును రైతు రక్షణ దినంగా ప్రభుత్వమే అధికారికంగా నిర్వరహించాలని సిపిఎం డిమాండ్ చేస్తుందన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతు నాడు భూమి, భుక్తి, విముక్తి కోసం సాగించిన రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో నిర్వాసితుల సమస్యలపై, మూడెకరాల భూ పంపిణీ సాధనకు పోరాడాలన్నారు. సిపిఎం సీనియర్ నాయకులు పి.అనంతరామశర్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం నాయకులు బైరు మల్లయ్య, తిరందాసు గోపి, ఎం.రాములు, ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, దండెంపల్లి సత్తయ్య, మల్లు లక్ష్మి, ఎం.ప్రభావతి, పాలడుగు నాగార్జున, అశోక్‌రెడ్డి, వసంతకుమార్ తదితరులు పాల్గొన్నారు.
కొమురయ్య పోరాట చరిత్రను పాఠ్యాంశం చేయాలి
గుండాల: తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య చరిత్రను పాఠ్యంశంగా లిఖించాలని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మత్తెపురం రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని గ్రంథాలయంలో జరిగిన దొడ్డి కొమురయ్య 75వర్ధంతి సభలో పాల్గొని మాట్లాడుతు కొమురయ్య ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు కంకణాబద్ధులై సమస్యల పరిష్కారం పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బి.సునితశ్రీనివాస్, సంఘం అధ్యక్షుడు దొడ్డి బిక్షం, కుమరస్వామి, జోగు మల్లయ్య, మిర్యాల ఆయిలయ్య, పుల్లయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.