నల్గొండ

గోదాంను ప్రారంభించిన సిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, జూలై 8: చౌటుప్పల్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.3.03 కోట్ల వ్యయంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం చేసిన గోదాంను శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా అంతకు ముందు మార్కెట్ యార్డులో ‘కబంద’ జౌషద మొక్కను నాటారు. అపక్కనే ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మార్కెట్ గోదాంను ప్రారంభించారు. లోపలికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. మార్కెటింగ్ శాఖ కమిషనర్ శరత్ ద్వారా గోదాం వివరాలు, వ్యయం, సామర్థ్యం, సోలార్ విద్యుత్ పనితీరు గురించి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌కు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, స్థానిక నాయకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి జి.జగదీశ్వర్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మర్ నేతి విద్యాసాగర్, జెడ్పీ చైర్మన్ బాలునాయక్, పార్లమెంటు సభ్యులు బూర నర్సయ్యగౌడ్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, డిఐజి అకున్ సబర్వాల్, ఎస్పీ ప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, భాస్కర్‌రావు, రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పల్లె రాజేశ్వర్‌రెడ్డి, మార్కెటింగ్ శాఖ కమిషనర్ శరత్, జెడ్పీటిసి సభ్యుడు పెద్దిటి బుచ్చిరెడ్డి, ఎంపిపి చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, మండల పరిషత్ వైస్ చైర్మన్ కాయితి జంగయ్య, సర్పంచ్ బొంగు లావణ్యజంగయ్యగౌడ్, ఎంపిటిసి సభ్యులు చింతల భూపాల్‌రెడ్డి, బడుగు మణెమ్మ, బుర్రి మంజుల, గోశిక సుమతి, బత్తుల వరలక్ష్మి, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నాయకులు తేర చిన్నపరెడ్డి, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, చింతల దామోదర్‌రెడ్డి, కంది లక్ష్మారెడ్డి, ముత్యాల భూపాల్‌రెడ్డి, భీమిడి యాదిరెడ్డి, చిరందాసు ధనుంజయ్య, బొంగు జంగయ్యగౌడ్, ఊడుగు శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు జిల్లా సరిహద్దులో ముఖ్యమంత్రి కేసిఆర్‌కు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు.
అంతా పది నిమిషాల్లోనే.....
ముఖ్యమంత్రి కేసిఆర్ చౌటుప్పల్ పర్యటన పది నిమిషాల్లోనే ముగిసిపోయింది. గత మూడు రోజులుగా స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, మార్కెటింగ్ శాఖ కమిషనర్ శరత్, జిల్లా ఎస్పీ ప్రకాష్‌రెడ్డిలు ముఖ్యమంత్రి పర్యటనకు భారీ ఏర్పాట్లు చేశారు.
ఉదయం 11.15 గంటలకు రావలసిన ముఖ్యమంత్రి 45 నిమిషాలు ఆలస్యంగా 12.00 గంటలకు మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కబంద జౌషద మొక్కను నాటి పక్కనే మార్కెట్ గోదాం ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మార్కెట్ గోదాంను ప్రారంభించారు. గోదాంను పరిశీలించి పది నిమిషాల్లోనే మళ్లీ బస్సు ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.