నల్గొండ

హాస్టల్స్, ఆశ్రమ పాఠశాలల్లో వసతులు మెరుగుపరుచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, జూలై 8: సంక్షేమ హాస్టల్స్, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించి ఈ విద్యాసంవత్సరంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని జడ్పీ సంక్షేమ స్థాయి సంఘం చైర్మన్ ప్రేమలత అన్నారు. శుక్రవారం జరిగిన ఆరవ స్థాయి సంఘం సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడుతు మండలాల్లోని బాల, బాలికల హాస్టల్స్‌లో అనేక వసతుల కొరత నెలకొందన్నారు. అలాగే మెను అమలులో నాణ్యత ప్రమాణాలపై ఆరోపణలున్నాయన్నారు. అలాంటి సమస్యల పరిష్కరానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. అసంపూర్తి హాస్టల్స్, పాఠశాలల భవనాలను తక్షణమే పూర్తి చేయించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ కార్పోరేషన్ల రుణ పంపిణీలో లక్ష్యాల్లో తీవ్రంగా వెనుకబడి ఉండటంతో ఆ వర్గాల పేదలకు అన్యాయం జరుగుతుందన్నారు. బ్యాంకర్లపై ఒత్తిడి తెచ్చి రుణ పంపిణీ సకాలంలో చేపట్టి నిరుపేదలకు ఉపాధి కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో జడ్పీటీసి సంధిగారి బస్వయ్య, జడ్పీ సిఈవో రావుల మహేందర్‌రెడ్డి, వివిధ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.